Site icon HashtagU Telugu

Telangana: గ్రేట‌ర్లో బ‌స్తీ ద‌వాఖాన‌ల డెడ్ లైన్

Basthi Davakhana

Basthi Davakhana

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఆగ‌స్ట్‌15వ తేదీ నాటికి మ‌రో 131 బ‌స్తీ ద‌వాఖాన‌ల‌ను సిద్ధం చేయడానికి తెలంగాణ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ మున్సిపల్‌ కార్పొరేషన్లు సంయుక్తంగా అందుకోసం ప‌నిచేస్తాయ‌ని ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 259 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. పట్టణ పేదలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, రోగనిర్ధారణ సేవలను అందిస్తుంది. ఆగస్టు 15 నాటికి తెలంగాణలో మొత్తం 390 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కానున్నాయి.

131 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తొలి విడ‌త మ‌రో 12 కేంద్రాలు ప్రారంభం కానున్నాయ‌ని మంత్రి వెల్ల‌డించారు. “ప్రతి బస్తీ దవాఖానకు టి-డయాగ్నస్టిక్ లేబొరేటరీలు అనుసంధానించబడుతున్నాయి. టెలికన్సల్టేషన్ సేవలు కూడా అమలు చేయబడుతాయ‌ని చెప్పారు. స్థానిక జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానలను పెడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల లభ్యత కు అనుగుణంగా T-డయాగ్నోస్టిక్స్ రోగి నమూనాల సేకరణలో సహాయం చేస్తుంది. పరీక్ష ఫలితాలు రోగుల మొబైల్ పరికరాలకు అందించబడతాయి. మరుసటి రోజు రోగితో ఫలితాలను కూడా తీసుకురావచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు.