1228 Kids Missing: తెలంగాణలో 3 ఏళ్లలో 1228 పిల్లలు మిస్సింగ్

బంగారు తెలంగాణలో బాల్యం ప్రశ్నార్థకమవుతోంది. లెక్కకు మించి మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి.

  • Written By:
  • Updated On - December 10, 2022 / 12:47 PM IST

నేటి బాలలే (Kids).. రేపటి పౌరులు. కానీ ఈ మాటకు అర్థమే మారిపోతోంది. అమ్మ గర్భం నుంచి బయటపడగానే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కిడ్నాప్, మిస్సింగ్ (Missing) లాంటి ఇష్యూతో బాల్యం కనుమరుగవుతోంది. బంగారు తెలంగాణలో భావి భారత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ (Telangana)లో 2019 నుంచి 2021 వరకు 1,228 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వారిలో 440 మంది ఆచూకీ లభించిందని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. దేశవ్యాప్తంగా తప్పిపోయిన 89 శాతం మంది పిల్లల జాతీయ సగటుతో పోలిస్తే ఇది 36 శాతం తక్కువ అని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది.

దేశవ్యాప్తంగా అదృశ్యమైన (Missing) 1,40,575 మంది చిన్నారుల్లో 1,25,445 మంది ఆచూకీ లభించింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్ష పడిన వ్యక్తుల రేటు 2021కి 16 శాతం తగ్గిందని మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. 2021లో 100 మందికి, 2020లో 120 మందికి, 2019లో 108 మందికి శిక్ష పడింది. 2021లో 2,698 పోక్సో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పోక్సో కేసుల్లో 6,080 మందికి శిక్ష పడింది.

Also Read: Kidnapping Case: కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ‘వైశాలి’ వ్యవహారాలు!