IPS Officers Transferred : తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల బదిలీ.. రాచకొండ సీపీగా తరుణ్‌జోషి

తెలంగాణ (Telangana)లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల(IPS)ను బదిలీ చేస్తూ (Transferred ) వస్తుంది రేవంత్ సర్కార్ (Cong Govt). ఇప్పటికే అనేక శాఖల్లో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేయగా…తాజాగా మరోమారు ఐపీఎస్‌ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాచకొండ సీపీ(Rachakonda […]

Published By: HashtagU Telugu Desk
Ips Trnsfer

Ips Trnsfer

తెలంగాణ (Telangana)లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల(IPS)ను బదిలీ చేస్తూ (Transferred ) వస్తుంది రేవంత్ సర్కార్ (Cong Govt). ఇప్పటికే అనేక శాఖల్లో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేయగా…తాజాగా మరోమారు ఐపీఎస్‌ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాచకొండ సీపీ(Rachakonda Commissioner of Police) గా వెళ్లిన సుదీర్‌బాబు(Sudheerbabu)ను సైతం బదిలీ చేసి..ఆయన స్థానంలో తరుణ్‌జోషి(Dr Tarun Joshi)ను సెలక్ట్ చేసారు. ఇక సుదీర్‌బాబు కు మల్టీజోన్‌-1 పూర్తిస్థాయి అదనపు ఐజీగానూ బాధ్యతలు ఇచ్చింది.

ఇక సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్‌ డేవిస్‌, సీఐడీ డీఐజీగా నారాయణ్‌ నాయక్‌, టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా కే అపూర్వ రావ్‌, సౌత్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీగా డీ ఉదయ్‌కుమార్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీగా ఆర్‌ గిరిధర్‌, రామగుండం సీపీగా శ్రీనివాసులు, జోగులాంబ జోన్‌ డీఐజీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌ నియామకమయ్యారు. అలాగే ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డెప్యూటీ డైరెక్టర్‌గా డీ మురళీధర్‌, టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రశ్మి పెరుమాల్‌ను బదిలీ చేసింది. ఇక బీ నవీన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.

Read Also : Medigadda Project : రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

  Last Updated: 12 Feb 2024, 11:36 PM IST