Site icon HashtagU Telugu

Omicron scare: 12 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్!

Omicron

Omicron

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వివిధ దేశాల నుంచి వచ్చిన 12 మంది ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకే, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్ అని తేలింది. పాజిటివ్‌గా తేలిన వారందరినీ చికిత్స కోసం తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు పంపామని, నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని అధికారులు తెలిపారు. ప్రయాణీకులందరూ లక్షణరహితంగా ఉన్నారని, ఓమిక్రాన్ కేసు నివేదించబడకపోతే వారిని హోమ్ ఐసోలేషన్‌కు పంపుతామని తెలిపారు. గురువారం, UK నుండి వచ్చిన ఒక మహిళ కూడా విమానాశ్రయంలో వైరస్ కోసం పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ కోసం టిమ్స్ కు పంపారు.