తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాట వేసిన చారిత్రక క్షణం 2014 ఫిబ్రవరి 18. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతీకగా, వేలాది మంది ఉద్యమకారుల త్యాగఫలంగా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాప్రతినిధులు కదిలి పోరాడిన ఫలితం ఇదే. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు లోక్ సభలో ‘ప్రత్యేక తెలంగాణ బిల్లు’ (Telangana Bill) ఆమోదం పొందింది.
SBI Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 250తో ప్రారంభం!
అప్పటి స్పీకర్ మీరా కుమారి మూజువాణి (Meira Kumar) ఓటింగ్ ద్వారా బిల్లును పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న ఉద్యమకారులకు విజయ ఘట్టంగా మారింది.ఆ తర్వాత ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh), తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. జూన్ 2, 2014న అధికారికంగా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది.
Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ
ఈ చారిత్రక ఘటన వెనుక అశేష ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ కారుల త్యాగాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం, అనేక రంగాల్లో ప్రగతి సాధించింది. ఐటి, వ్యవసాయం, విద్య, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. 11 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్లింది. ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.