Site icon HashtagU Telugu

SSC Exam Paper: టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. వాట్సాప్ లో చక్కర్లు!

TS SSC Result

Ssc

TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగియకముందే తాజాగా మరో పేపర్ లీక్ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్ష మయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.37 గంటలకు ప్రశ్నా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.

తెలుగు ప్రశ్నాపత్రం… అయితే వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం తమ జిల్లా పరిధిలో ప్రశ్నాపత్రం లీక్ కాలేదని చెబుతున్నారు. దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షకు హాజరయ్యారు. అయితే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం లీకేజీ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరులోని ఒక వాట్సప్ గ్రూపులో ఈ ప్రశ్నాపత్రం కనిపించింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పేపర్ లీక్ ఘటనపై పదో తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.