Site icon HashtagU Telugu

Lok Sabha 2024: బీఆర్‌ఎస్ కు బిగ్ షాక్.. 106 మందిపై సస్పెన్షన్ వేటు

Lok Sabha 2024

Lok Sabha 2024

Lok Sabha 2024: మెదక్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి హాజరైన 106 ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కారణంగా వారిపై చర్యలు తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదానికి ప్రభుత్వ ఉద్యోగులు బలయ్యారు.

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైనందుకు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏప్రిల్ 7న మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మెదక్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంసీసీ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావు రిటర్నింగ్‌ అధికారి, రెవెన్యూ డివిజనల్‌ అధికారికి ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.

We’re now on WhatsAppClick to Join

ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సమావేశం జరిగిన ఫంక్షన్ హాల్‌ ను సందర్శించింది. యాజమాన్యం నుంచి సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. సిద్దిపేట అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి అనుమతి లేకుండా బీఆర్‌ఎస్‌ సమావేశాన్ని నిర్వహించినట్లు గుర్తించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు నేతలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సమావేశానికి హాజరైన డీఆర్‌డీఏకు చెందిన 40 మంది ఉద్యోగులను ఎన్నికల అధికారులు గుర్తించారు. అనంతరం మరో 66 మంది ఉద్యోగులను గుర్తించారు. మొత్తం 106 మంది సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేశారు.

Also Read: SBI Amrit Kalash: పండుగ వేళ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ..!