KCR Vs 1016 : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు 1,016 మంది లబానా కాయితీ లంబాడీలు రెడీ అయ్యారు. ఈవిషయాన్ని లబానా కాయితీ లంబాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ ప్రకటించారు. సీఎంపై పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను మండలాల వారీగా ఆయన వెల్లడించారు. ఓసీ జాబితాలో ఉన్న కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సీఎం కేసీఆర్ నుంచి స్పందన లేకపోవడంతో ఈవిధంగా ఆయనపై పోటీకి దిగాలని నిర్ణయించామన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే, మూడు, నాలుగు రోజుల్లో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈసారి అసెంబ్లీ పోల్స్ లో సీఎం కేసీఆర్ తన సిట్టింగ్ స్థానమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి జిల్లాలో దాదాపు 20 వేల మంది కాయితీ లంబాడీలు ఉన్నారు. వారు కేసీఆర్‌పై పోటీ చేస్తే.. ఆ ఓట్లు బీఆర్ఎస్‌కు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అక్కడ ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో(KCR Vs 1016) వ్యక్తమవుతోంది.