Site icon HashtagU Telugu

Harish Rao : ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారెంటీ – హరీష్ రావు

Harish Rao Janwada Farmhous

Harish Rao Janwada Farmhous

తెలంగాణ (Telangana) లో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ (BRS) 100 సీట్లు సాదిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ధీమా వ్యక్తం చేసారు. బుధువారం తెలంగాణ భవన్ లో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్బంగా వ్యవహార శైలి , బీఆర్‌ఎస్, మరియు రాష్ట్ర రాజకీయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాని ప్రజలు ఆశిస్తున్నారని , ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు వంద సీట్లలో బిఆర్ఎస్ ను గెలిపిస్తారని అన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడం కేసీఆర్ దయ అని , బీఆర్‌ఎస్ లేకుంటే తెలంగాణ సాధన సాధ్యం అయ్యేదికాదన్నారు.

సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్‌ చేసుకోవాలని.. తన కుర్చీని ఎప్పుడు గుంజుకుపోతారోనన్న భయంలో రేవంత్‌ ఉన్నాడన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని.. సీఎం అయ్యేది కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్‌ మూడుసార్లు ఓడిందని.. మరి కాంగ్రెస్‌ ఖతం అయిపోయిందా? అంటూ ప్రశ్నించారు. 31 సాకులు చూపుతూ రుణమాఫీ చేయకుండా రేవంత్‌ రైతులను మోసం చేశారని విమర్శించారు. ఇక హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ పెట్టడం తుగ్లక్‌ చర్య అంటూ హరీష్ మండిపడ్డారు.

అవినీతి, దురాలోచనతోనే ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.35వేలకోట్ల ఖర్చు అని అంటున్నారని.. కేంద్రం ఫ్రీగా చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం ఎందుకని నిలదీశారు. రేవంత్‌ ప్రభుత్వం 11 నెలల్లోనే రూ.85వేలకోట్ల అప్పులు చేసిందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పు రూ.4,26,499కోట్లు మాత్రమేనన్నారు. పదినెలల కాంగ్రెస్‌ పాలనలోనే రూ.85వేలకోట్ల అప్పులు తీసుకున్నట్లుగా క్లియర్‌గా ఉందని.. బడ్జెటేతర రుణాల వివరాలను తమకు చెప్పలేదని కాగ్‌ తన నివేదికలో చెప్పిందని గుర్తు చేశారు. అప్పుల వివరాలు ఎందుకు చెప్పడం లేదని.. ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.

Read Also : Alzheimer’s Disease : భారతీయ శాస్త్రవేత్తల సరికొత్త ప్రయత్నంలో అల్జీమర్స్ వ్యాధికి మందు కనుగొంది