Site icon HashtagU Telugu

Munugode : మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు…!!

Munugode

Munugode

మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి నిమిషం వరకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 119మంది అభ్యర్థులు 187సెట్ల నామినేషన్లు వేశారు. అయితే నిన్న చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చాయి. మొత్తం 129మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈనెల 17 నామినేషన్ల ఉపసంహారణకు చివరి గడువు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. చర్లగూడం రిజర్వాయర్ భూ నిర్వాసితులు తమ నిరసన తెలియజేసేందుకు ఉపఎన్నికను అస్త్రంగా ఎంచుకున్ారు. పదుల సంఖ్యలో నిర్వాసితులు ఈ ఉపఎన్నికలో నామినేషన్ వేశారు. దీంతో మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్లు సెంచరీ దాటాయి.

టిఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు. తెలంగాణ జన సమితి అభ్యర్థిగా పల్లె వినయ్, బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్లు దాఖలు.

Exit mobile version