Site icon HashtagU Telugu

100 Feet Statue of NTR : హైదరాబాద్ లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం..ఎక్కడంటే..!!

Ntr Statue Hyderabad

Ntr Statue Hyderabad

హైదరాబాద్ (Hyderabad) నగరం ఇప్పుడు మహనేతల విగ్రహాలకు కేరాఫ్ గా మారుతుంది. ఒకప్పుడు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానేతల విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసారు. కానీ ఇప్పుడు రాజకీయ నేతల తాలూకా విగ్రహాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురి విగ్రహాలు ఏర్పాటు చేయగా..మరికొందరి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. తాజాగా తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు విగ్రహాన్ని (100 Feet Statue of NTR) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం తో టీడీపీ శ్రేణుల్లో , నేతల్లో మల్లి ఉత్సాహం మొదలైంది. ఈ విజయం తో తెలంగాణ లో కూడా టీడీపీ కి పూర్వ వైభవం తీసుకరావాలని చంద్రబాబు భావిస్తున్నాడు. ఈ క్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.

హైదరాబాద్ నగరంలో టీడీపీని స్థాపించిన మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) విగ్రహం ఏర్పాటు చేస్తామని.. టీడీ జనార్ధన్(TD Janardhan) తెలిపారు. గతంలో టీడీపీని స్థాపించిన చోటే వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని(statue) ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు వారు అందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. టీడీపీ(TDP) పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. NTR చేసిన సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌ నగరంలో అన్నగారి విగ్రహాన్ని(statue) ఏర్పాటు చేసి తెలుగు ప్రజలకు అంకితమిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు.

Read Also : Transgender : అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్.. సారా మెక్‌బ్రైడ్ నేపథ్యం ఇదీ