KCR : కామారెడ్డిలో పౌల్ట్రీ రైతుల నుండి కేసీఆర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది

ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోడంతో దానికి నిరసనగా కేసీఆర్‌పై పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో.. విడతల వారీగా 100 మంది పాల్ట్రీ రైతులు నామినేషన్లు వేస్తారని తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Kcr kamareddy

Kcr kamareddy

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (KCR) త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి (kamareddy) నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కామారెడ్డి లో కేసీఆర్ కు రైతుల నుండి పెద్ద చిక్కువచ్చి పడింది. కేసీఆర్‌పై 100 మంది నామినేషన్లు (100 farmers Nominations Against KCR) వేయబోతున్నామని పౌల్ట్రీ రైతులు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రావు, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పాల్ట్రీ ధరలను కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తున్నాయని, దీని వల్ల తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోడంతో దానికి నిరసనగా కేసీఆర్‌పై పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో.. విడతల వారీగా 100 మంది పాల్ట్రీ రైతులు నామినేషన్లు వేస్తారని తెలిపారు. పాల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించుకునేలా అవకాశం కల్పించాలని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగానే.. పాల్ట్రీ రంగానికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సెంట్రల్ బోర్డు ద్వారా పాల్ట్రీ రంగానికి ఇచ్చే 50 శాతం సబ్సిడీని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

అంతే కాకుండా గ్రో ఇన్ ఛార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలని, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మక్కలు పాల్ట్రీ రంగానికి 28 శాతం సబ్సిడీకి ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు నామినేషన్లు వేస్తున్నట్లు తెలిపారు.

Read Also : YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం, ఎన్నికల పోటీకి YSRTP దూరం!

  Last Updated: 03 Nov 2023, 12:47 PM IST