Eatala Victory: ఈటలని గెలిపించిన పది సూత్రాలు ఇవే

రసవత్తరంగా సాగిన హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈటల గెలుపుకు కారణాలను విశ్లేషిస్తే ఈ కింది పది కారణాలు చాలా వాలిడ్ అని చెప్పొచ్చు.

  • Written By:
  • Updated On - November 3, 2021 / 12:02 PM IST

రసవత్తరంగా సాగిన హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈటల గెలుపుకు కారణాలను విశ్లేషిస్తే ఈ కింది పది కారణాలు చాలా వాలిడ్ అని చెప్పొచ్చు.

1. ఈటల కొన్ని కారణల వల్ల బీజేపీలో చేరారు. ఆయనకున్న క్రెడిబిలిటీ వల్ల ఆయన యే పార్టీలో ఉన్నా ఇలాగే ఫలితం ఉండేది. ఓటర్లు కూడా ఇది కేసీఆర్ కి తెలంగాణ సమాజానికి జరుగుతున్న యుద్ధంగా భావించారు. బీజేపీలో చేరినప్పటికీ ఇతర నాయకులలాగా మతం కార్డు వాడకపోవడం, అమిత్ షా లాంటి నాయకులు ప్రచారంలో పాల్గొనకపోవడం ఈటెల ఇమేజ్ కాపాడిందని చెప్పొచ్చు.

2. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పని వాదించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే గులాబీ జెండా ఓనర్ ని నేనని స్టేట్మెంట్ ఇవ్వడం దాని తర్వాత కూడా మాటల యుద్ధం కొనసాగడం లాంటి చర్యలు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నాడనే ఒపీనియన్ తీసుకొచ్చింది. అది ఈ ఎన్నికల్లో చాలా ప్లస్ అయింది.

3. మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత ఈటల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం నుండే ఇది ఆత్మగౌరవ పోరాటమని విక్టిమ్ కార్డు వాడడం చాలా పెద్ద ప్లస్. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంట్ పెరగడానికి కూడా ఇదే కారణమని చెప్పొచ్చు.

Also Read  : రేవంత్ క్రేజ్ గ‌ల్లంతు.. హుజురాబాద్ లో అడ్రస్ లేని కాంగ్రెస్!

4. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నియోజకవర్గంలో ఎవరికీ పెద్దగా తెలియకపోవడం కూడా ఈటలకి కలిసొచ్చింది. వేరే ఫెమిలియర్ నాయకుడు పోటీలో ఉంటే ఫలితాల్లో తేడా ఉండేది.

5. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటలకి టఫ్ ఫైట్ ఇచ్చిన కౌశిక్ టిఆర్ఎస్ లో చేరడంతో ఈటెలకి పెద్ద అపోనెంట్ పక్కకి తప్పుకోవడం కూడా హెల్ప్ అయిందని చెప్పొచ్చు.

6. తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఒక ఉద్యమకారుడిగా, పార్టీ కీలక సభ్యుడిగా, కేసీఆర్ కిచెన్ క్యాబినెట్ లో ముఖ్యుడిగా మెలిగిన ఈటలకి కేసీఆర్ పోల్ మేనేజిమెంట్, స్ట్రాటజీ తెలియడంతో, టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలంటే ఎలా మూవ్ అవ్వాలో ఈటెలకి ఈజీ అయ్యింది.

Also Read  :  స్టీల్ ప్లాంట్ ఉద్య‌మంలోకి ప‌వ‌న్‌..ఆందోళ‌న‌లో వైసీపీ

7. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు కేసీఆర్ కి కలిసిరాకపోగా బ్యాక్ ఫైర్ అయింది. అది ఈటెలకి కలిసొచ్చింది.

8. రాజకీయ పార్టీలు డబ్బులు పంచినా తీసుకోని ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తామని ఓటర్లు డిసైడ్ అయ్యారు. ఇక యువకులు నిరుద్యోగం, ఉద్యోగాల నోటిఫికేషన్లు లాంటి విషయాలను ప్రియారిటీగా తీసుకున్నట్టు కనిపించింది.

9. ఉద్యమ సమయంలో కేసీఆర్ కి మద్దతు తెలిపి, కేసీఆర్ పాలనతో నిరాశకి గురవుతున్న ఒక లేయర్ ఈ ఎన్నిక ఫలితాలతో కేసీఆర్ కి ఒక మెసేజ్ ఇద్దామని భావించారు.

10. ఈటల రాజేందర్ కి హుజురాబాద్ ప్రజలతో ఉన్న రిలేషన్, కాంటాక్ట్స్, ఎమ్మెల్యేగా ఇన్ని రోజులు అక్కడి ప్రజలకు అండగా ఉండడం ప్రజలు మళ్ళీ ఆయన్నే ఎన్నుకునేలా సహాయపడ్డాయి.