KCR Press Meet : కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పది అంశాలు ఇవే

కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తావించిన పది అంశాలు

  • Written By:
  • Updated On - November 21, 2021 / 12:13 AM IST

కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తావించిన పది అంశాలు

తెలంగాణ సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. వరిసాగు విషయంలో కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్.. ఆ సమయం దాటినా రైతులకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని కేంద్రం వైఖరిని విమర్శించారు. కేసీఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే

1. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సమాధానం లేదు. రేపు మంత్రులు, ఎంపీలు, అధికారులతో ఢిల్లీ వెళ్తున్నా.
చివరి ప్రయత్నంగా కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ని కలుస్తాం.

2. నల్లచట్టాల విషయంలో రైతులు సాధించింది మామూలు విజయం కాదు. రైతులకు సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ ఉద్యమంలో రైతుల మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి. రైతుల ఉద్యమానికి మద్దతు తెల్పిన దిశా అనే అమ్మాయి పై పెట్టిన దేశ ద్రోహం కేసును ఎత్తివేయాలి.

3. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమంలో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుండి మూడు లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తాం. చనిపోయిన రైతుల కుటుంబాలను కాపాడే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. వారికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషీయా ఇవ్వాలి.

4. కనీస మద్దతు ధర కోసం చట్టం తేవాలి. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. రైతుల విషయంలో కేంద్రానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది.

5.విద్యుత్ చట్టాన్ని తెచ్చి మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారు. మీటర్లు పెట్టడానికి మేము సిద్దంగా లేము. విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే మరో ఉద్యమం మొదలవుతుంది. విద్యుత్ చట్టాన్ని పార్లమెంట్ లో వ్యతిరేకిస్తాం.

6. గోదావరి, కృష్ణాలో నీటి వాటాలు తేల్చాలి అని కేంద్ర మంత్రి, ప్రధానిని కోరతాము
వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని కోరతాం.
తేల్చక పోతే పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం.

7. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మాణం చేసి పంపాము. వర్గీకరణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. బీసీ కులగణన వెంటనే చేయాలని సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాం.

8.స్థానిక బిజెపి నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు. మీరు చేసిన తప్పుడు ప్రకటనలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని మోదీ చెప్పిన విషయాలు ఎవరు నమ్మడం లేదు. ఎన్నికల స్టంట్ గా భావిస్తున్నారు.

9. వానాకాలం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం. కొంత మంది రాజకీయ బేహారులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.యాసంగి రైతుబంధు సమయంలోనే వస్తుంది.

10. కేంద్ర విధానాలపై పోరాడే సమయంలో సమయాన్ని బట్టి కలుపుకుని వెళ్లే వారిని కలువుకోని వెళతాం.