ప్రయాణికులకు నిత్యం తీపి కబుర్లు తెలుపుతూ వస్తున్న TSRTC ..తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది. లహరి (TSRTC Lahari AC Sleeper Bus) AC స్లీపర్, AC స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బుకింగ్ బెర్తులపై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. రోజు రోజుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుండడం..ప్రస్తుతం సమ్మర్ కూడా మొదలుకావడం తో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలో ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ ఉంటుందని.. ప్రయాణికులు ఈ డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. లహరి AC స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖ, బెంగళూరు మార్గాల్లో నడుస్తున్నాయని, లహరి AC స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ తదితర రూట్లలో తిరుగుతున్నాయని RTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ క్రమంలో బుకింగ్ బెర్తులపై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also : Praja Deevena Sabha : మోడీ , కేసీఆర్ లను ఉతికిఆరేసిన సీఎం రేవంత్