Bike Racing: రాయదుర్గం రోడ్ల ఫై డేంజరెస్ స్టంట్స్ ..గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 11:51 AM IST

హైదరాబాద్ లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రకరకాల స్టంట్లు (Bike Racing) చేస్తూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు పక్కవారి ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. ఇలా పోకిరీలు రద్దీగా ఉండే రహదారులపై కార్లు, బైక్​లతో హల్‌చల్‌​ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రేసింగ్‌లు, స్టంట్లు చేస్తున్నారు. అధిక వేగంతో రయ్​రయ్​మంటూ చక్కర్లు కొడుతూ, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కొందరు పోకిరీలు ఇందుకు సంబంధించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు చూసిచూడనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు రాయదుర్గం టీహబ్‌ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రోడ్లు బైకు రేస్‌లు, విన్యాసాలకు అడ్డగా మారుతున్నాయి. హైదరాబాద్‌ నలమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా అక్కడికి చేరుకుంటారు. వాహనాలను మెరుపు వేగంతో డ్రైవ్ చేయడమే కాక విన్యాసాలూ చేస్తుంటారు. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో ఆకతాయిల జోరుకు అడ్డుకట్ట పడడంలేదు. అర్ధరాత్రి జనసంచారం పూర్తిగా తగ్గిపోగానే బైకర్లకు పందేలు కాస్తుంటారు. అలా వారు వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పితే అక్కడి డివైడర్లు, ఫుట్‌పాత్‌లకు తగిలి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఒక్కోసారి ఇతరులకు నష్టం కలుగవచ్చు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్న వారు మాత్రం ఆపడం లేదు. నిన్న రాత్రి కూడా ఇలాగే పదుల సంఖ్యలో బైకర్లు రేస్ లు చేసారు. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు కూడా ఈ రేస్ లు కొనసాగాయి. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి పోలీస్ వ్యవస్థలో నిర్లక్ష్యం ఎక్కువ అవుతుందని..ఎక్కడ చూసిన నేరాలు పెరిగిపోతున్నాయని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Akira Nandan Mamitha Baiju Love Story : అకిరా నందన్ తో మమితా బైజు.. ఈ కాంబో సెట్ అయితే మాత్రం..!