Ktr Comments: కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఓ వైపు సాగుతున్న సమయంలో మరో వైపు తెలంగాణ ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడు హైదరాబాద్‌లని ఓ స్టార్ హోటల్‌లో అదానీని (Adani) కలిశారని కేటీఆర్ (Ktr) ఆరోపించారు. భేటీలో ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడితో పాటు… రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu) కూడా ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. అసలు వీరి మధ్య జరిగిన చర్చలేంటి.. జరిగిన ఒప్పందాలేమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో మాట్లాడిన కేఏ పాల్ (Ka Paul) కూడా… ఇలాంటి ఆరోపణలే చేశారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ఆ నెంబర్ టూ ఎవరో చెప్పలేదు కానీ.. కేఏ పాల్ మాత్రం బయట పెట్టేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అదానీని హోటల్లో ఎందుకు కలిశాడు.. అందులో సునీల్ కొనుగోలు (Sunik Kanugolu) ఎందుకు ఉన్నాడో చెప్పాలన్నారు కేటీఆర్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు.. అందరికి టోపీలు పెడుతుంటాడని ఆరోపించారు. వీళ్లకు ఓట్లు వేయడానికి ప్రజలకు కూడా బుద్ధి లేదంటూ విమర్శించారు.
అదానీతో పొంగులేటి, సునీల్ కనుగోలు భేటీ అయినట్లుగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన (Govt Announcement) చేయలేదు. మరో వైపు పొంగులేటి కానీ అదానీ గ్రూప్ (Adani Group) కానీ… ఈ సమావేశంపై రియాక్ట్ (React) అవ్వలేదు. దీంతో అసలు సమావేశం జరిగిందా లేదా అన్నదానిపై…ఇప్పుడు చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఆదానీ గ్రూపును బీజేపీ సన్నిహిత కంపెనీగా..ఎప్పటి నుంచో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) చెప్తూ ఉంటారు. ఇలాంటి నేపధ్యంలో…కాంగ్రెస్ ఎమ్మెల్యే కమ్ మంత్రి జాతీయ స్థాయిలో కూడా అదానీపై (Adani) కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు (Comments) చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అదానీతో.. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సమావేశం అయ్యారని బయటకు రావడం కలకలం రేపేదే.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెలంగాణలో విజయం సాధించడం వెనుక సునీల్ కనుగోలు వ్యూహాలు ఎక్కువగా ఉన్నాయని నమ్ముతారు. కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో రాజకీయ అంశాలపై చర్చ జరిగిదని భావిస్తున్నారు. అలాగే తెలంగాణలో ఏదైనా భారీ ప్రాజెక్టు అదానీ చేతికి వెళ్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మొత్తంగా అదానీతో భేటీపై పొంగులేటి శ్రీనివసరెడ్డి ఓ ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
https://x.com/KTRBRS/status/1841517085534363737?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1841517085534363737%7Ctwgr%5Eb89436669fa4c1fbed01eb8317af2bdf918860cb%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Ftelangana%2Fktr-alleged-that-ponguleti-met-adani-in-hyderabad-182581