Exit Poll : తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల్లో కాంగ్రెస్‌దే హ‌వా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. అక్క‌డ‌క్క‌డ కొన్ని చిన్న చిన్న ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌గా పోలీసులు, ఎన్నిక‌ల

  • Written By:
  • Updated On - November 30, 2023 / 06:19 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. అక్క‌డ‌క్క‌డ కొన్ని చిన్న చిన్న ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌గా పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు వాటిని నియంత్రించారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. స‌మ‌స్య‌త్మాక ప్రాంతాల్లో 4 గంట‌ల‌కే ఎన్నిక‌లు ముగిశాయి. ఎన్నిక‌లు ముగియ‌గానే ప‌లు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను విడుద‌ల చేశాయి. చాలా సంస్థ‌లు చేసిన స‌ర్వేలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుస్తుంద‌ని వెల్ల‌డించాయిచ. అయితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో మ్యాజిక్ నంబర్ 60గా ఉంది. కాంగ్రెస్ పార్టీ 67 నుంచి 75 స్థానాలు సాధిస్తుంద‌ని మెజార్టీ స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డించాయి. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ ఆరా మ‌స్తాన్‌.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ 58 నుంచి 67 స్థానాలు సాధిస్తుంద‌ని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 41 నుంచి 49 స్థానాలు సాధిస్తుంద‌ని వెల్ల‌డించింది. గ‌తంలో ఆరా చేసిన స‌ర్వేల‌న్ని ఖ‌చ్చితంగా నిజ‌మైయ్యాయి. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నార‌ని అక్క‌డ బీజేపీ గెలుస్తుంద‌ని ఆరా స‌ర్వే వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇటు చాణ‌క్య స‌ర్వే కూడా కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించింది. కాంగ్రెస్ 67 నుంచి 78 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని తెలిపింది. బీఆర్ఎస్ 22 నుంచి 31 సీట్ల‌కే ప‌రిమితం అవుతంద‌ని చాణ‌క్య స్ట్రాట‌జిస్ వెల్ల‌డించింది.