Telangana : తెలంగాణ‌లో మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎన్నిక‌ల స‌మ‌ర‌భేరి

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. అభ్య‌ర్థుల‌కు బీఫామ్‌లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నుంచి ప్ర‌జా

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 06:36 PM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. అభ్య‌ర్థుల‌కు బీఫామ్‌లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నుంచి ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ను మొద‌లుపెట్టింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా 55 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితా ప్ర‌క‌టించింది. ఈ నెల 18 నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. 18న మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని మూలుగు నియోజ‌క‌వ‌ర్గంలో రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు. రామ‌ప్ప దేవాల‌యాన్ని సంద‌ర్శించిన అనంత‌రం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీ పాల్గొన‌నున్నారు. రాత్రి 7 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని భూపాలప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిరుద్యోగుల‌తో క‌లిసి పాద‌యాత్ర చేయ‌నున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండ‌వరోజు (19వ తేదీ) పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ ప‌రిధిలోని రామ‌గుండం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 10గంట‌ల‌కు నియెజ‌క‌వ‌ర్గంలో ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల‌తో రాహుల్‌గాంధీ మాట్లాడ‌నున్నారు. సింగ‌రేణి ఉద్యోగుల స‌మ‌స్య‌లు, కాంట్రాక్టు కార్మికుల స‌మ‌స్య‌ల‌ను రాహుల్ గాంధీ విన‌నున్నారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే బ‌హిరంగ స‌భలో రాహుల్ గాంధీ పాల్గొన‌నున్నారు. రాత్రి 7గంట‌ల‌కు క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేయ‌నున్నారు. మూడ‌వ రోజు (20వ తేదీ) నిజ‌మాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ పాల్గొన‌నున్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు బీడీ కార్మికుల‌తో రాహుల్ గాంధీ స‌మావేశం కానున్నారు. అనంత‌రం నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని సంద‌ర్శించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఆర్మూర్‌లో బ‌హిరంగ స‌భలో పాల్గొన‌నున్నారు. రాత్రి 7గంట‌ల‌కు నిజామాబాద్‌లో జ‌రిగే పాద‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు. రాహుల్ గాంధీ మూడు రోజుల ఎన్నిక‌ల ప్రచార టూర్‌ని స‌క్సెస్ చేసేందుకు టీపీసీసీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది.

Also Read:  KCR Twist: కేసీఆర్ సడెన్ ట్విస్ట్.. వణికిపోతున్న అభ్యర్థులు