KTR Tweet: ప్రతి ఒక్కరూ “ముచ్చటగా” ఓటు హక్కును వినియోగించుకోండి: కేటీఆర్

బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ (KTR Tweet) ఓటింగ్ కు సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి చూద్దాం.

Published By: HashtagU Telugu Desk
KTR Tweet

KTR Election Campaign

KTR Tweet: తెలంగాణలో గురువారం ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి రాష్ట్ర ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల పోలింగ్ జోరుగా ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ హీరోలు కుటుంబసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ (KTR Tweet) ఓటింగ్ కు సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి చూద్దాం.

Also Read: Rahul Gandhi Tweet: పోలింగ్ వేళ రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్.. “దొరలపై ప్రజలు గెలవబోతున్నారు..”!

మీ ఓటు..పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి. మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి. మీ ఓటు.. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి. మీ ఓటు.. వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి. మీ ఓటు.. మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి. మీ ఓటు.. యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి. మీ ఓటు.. సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలి. మీ ఓటు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి. మీ ఓటు.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధాకానివ్వకండి. అందుకే.. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.. అందరూ రండి..! ప్రతి ఒక్కరూ “ముచ్చటగా…” ఓటు హక్కును వినియోగించుకొండి..!! జై తెలంగాణ.. జై భారత్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

9 గంటల వరకూ ఓటింగ్ శాతం ఎంతంటే..?

రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు.

  Last Updated: 30 Nov 2023, 10:29 AM IST