Site icon HashtagU Telugu

Telangana: రాజేంద్రనగర్‌లో భారీగా బంగారం స్వాధీనం

Telangana (19)

Telangana (19)

Telangana: తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలైంది. కోడ్ నియమావళి ప్రకారం ప్రతిఒక్కరు 50 వేలకు మించి నగదు, తదితర బంగార ఆభరణాలు తీసుకెళ్ళరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి లేదా సరైన పాత్రలను కూడా తీసుకెళ్లాలి. కానీ పక్షంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే నగదు జప్తు చేయబడుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ చర్యల ఫలితంగా పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలైన కొద్దీ గంటల్లోనే నగదు మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా , సరైన పత్రాలు చూపకపోవడంతో వాహనంలో ఉన్న 50 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ. 30 లక్షలు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులకు అప్పగించారు .

ఎన్నికల కోడ్‌ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భద్రతా చర్యల్లో భాగంగా నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, అబిడ్స్, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Also Read: Nara Lokesh : IRR కేసులో ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. నేరుగా ఢిల్లీకి బ‌య‌ల్దేరిన లోకేష్‌