Site icon HashtagU Telugu

Telangana: ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా బదిలీలు

Telangana (24)

Telangana (24)

Telangana: తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలను సజావుగా సాగించేందుకు ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంలో పని చేసే అధికారుల్ని ఈసీ బదిలీలకు పాల్పడింది. వారిని బదిలీ చేసే అధికారం ఈసీకి ఉంటుంది. పనితీరుపై ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసినా, ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చినా.. వెంటనే వారిని బదిలీ చేస్తూఈసీ నిర్ణయాలు తీసుకుంటుంది. అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డిజిపి (DGP)లను కూడా మార్చే పవర్ ఈసీకి ఉంటుంది. బదిలీ అనంతరం వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తుంది.

పదిమంది ఎస్పీల బదిలీ.

1.సంగారెడ్డి-రమణకుమార్,

2.కామారెడ్డి-శ్రీనివాసరెడ్డి.

3.మహబూబాబాద్-చంద్రమోహన్,

4.జోగులాంబగద్వాల-సృజన

5.జగిత్యాల-భాస్కర్,

6.సూర్యాపేట-రాజేంద్రప్రసాద్,

7.మహబూబ్‌నగర్‌-నర్సింహ,

8.నాగర్ కర్నూల్-మనోహర్,

9.నారాయణపేట-వెంకటేశ్వర్లు

10.భూపాలపల్లి-కరుణాకర్,

Also Read: Guru Mantram : గురు మంత్రము మరియు పరిహారములు..!