BRS : 54 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోల్ ఇంఛార్జ్‌ల‌ను నియ‌మించిన బీఆర్ఎస్‌

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ 54 అసెంబ్లీ సెగ్మెంట్ల పార్టీ ఇంచార్జ్‌ల తొలి జాబితాను విడుదల చేశారు.

  • Written By:
  • Updated On - October 13, 2023 / 10:28 AM IST

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ 54 అసెంబ్లీ సెగ్మెంట్ల పార్టీ ఇంచార్జ్‌ల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించడంలో ఈ ఇన్‌ఛార్జ్‌లు కీలకపాత్ర పోషిస్తారన్నారని తెలిపారు. కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ (BRS)కు అనుకూల వాతావరణం ఉందన్నారు. వివిధ రంగాల్లో తెలంగాణ ఎదుగుదలను ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ ఇన్‌ఛార్జ్‌లను కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతిపక్ష పార్టీలు తరచూ ఎన్నికలను వాగ్దానాలకు వేదికలుగా ఉపయోగిస్తుండగా, గత దశాబ్దంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రదర్శించేందుకు BRS అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి లబ్ధిదారుడికి చేరవేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను ఇంఛార్జ్‌ల‌కు అప్పగించారు. పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రచార బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని వారికి సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు వచ్చే 45 రోజుల పాటు తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని పార్టీ ఇన్‌ఛార్జ్‌లను కోరారు. పార్టీ అభ్యర్థులకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని, బూత్ స్థాయి కమిటీల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సజావుగా ప్రచారం నిర్వహించేందుకు ‘సమగ్ర ప్రణాళిక’ను అమలు చేయాలని సూచించారు.

Also Read:  S Jaishankar Security: విదేశాంగ మంత్రి జైశంకర్‌కి భద్రత పెంపు.. కారణమిదేనా..?