AIMIM MLA : టికెట్ నిరాక‌రిస్తే ఎంఐఎంకు రాజీనామా చేసే యోచ‌న‌లో చార్మినార్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్‌.?

తెలంగాణ ఎన్నిక‌ల్లో టికెట్లు రాని నేతలు పార్టీలు మారుతున్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి విప‌రీతంగా జంపింగ్‌లు

  • Written By:
  • Publish Date - October 31, 2023 / 09:02 AM IST

తెలంగాణ ఎన్నిక‌ల్లో టికెట్లు రాని నేతలు పార్టీలు మారుతున్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి విప‌రీతంగా జంపింగ్‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌కు పార్టీ టిక్కెట్‌ రాకపోవచ్చని ఎంఐఎం పార్టీ తెల‌ప‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల కాంగ్రెస్ 3వ జాబితాలో చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చోటు దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌కు ఈ ఎన్నిక‌ల‌కు రిటైర్ అవ్వాల‌ని పార్టీ కోరింది. అయితే తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని.. త‌న‌కు ఇవ్వ‌క‌పోతే తన కొడుకు ఇంతియాజ్‌కు అదే టిక్కెట్‌ను ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించాడు. అయితే, పార్టీ అధిష్టానం దీనికి అంగీక‌రించే ఆలోచ‌న‌లో లేకపోవ‌డంతో పార్టీ మారేందుకు ముంతాజ్ అహ్మ‌ద్ సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. అయితే ఎమ్మెల్యే ముంతాజ్‌ని బుజ్జ‌గించేందుకు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముంతాజ్ ఖాన్‌ను క‌లిశారు. భ‌విష్య‌త్‌లో పార్టీలో స‌ముచిత‌స్థానం క‌ల్పిస్తామ‌ని అక్బ‌రుద్దీన్ ఒవైసీ హామీ ఇచ్చారు. దీంతో ఆయ‌న కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం. కానీ ముంతాజ్ అహ్మ‌ద్ అనుచ‌రులు మాత్రం పోటీ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. లేదంటే కాంగ్రెస్‌లో చేరి పోటీ చేయాల‌ని ఆయ‌న అనుచ‌రులు కోరుతున్నారు.