ZTE Axon 40 Ultra Space Edition: మార్కెట్ లోకి 18జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు విరిగిపోతుంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు విరిగిపోతుంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు అయినా కనిపిస్తున్నాయి. కాగా భారతదేశ జనాభా 140 ఉంటే అందులో దాదాపుగా 120 కోట్ల మందికి పైగా ఫోన్ ని వినియోగిస్తుంటే అందులో 60 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ ఈ వినియోగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఏ రేంజ్ లో పెరుగుతున్నారు అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ తయారీ సంస్థలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఎన్నో రకాల స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఏటా పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ అందిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 40 సిరీస్ క్రింద పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 అల్ట్రా స్పేస్ ఎడిషన్‌ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. తాజాగా ఈ ఫోన్‌ ను చైనా మార్కెట్‌ లోకీ ప్రవేశపెట్టింది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ని రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. అందులో 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,898 యువాన్లు అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 67,200.

అలాగే 18జీబీ ర్యామ్ 1టి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 7,698 యువాన్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 87,700 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్‌లో లభించనుంది. జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 40 అల్ట్రా స్పేస్ ఎడిషన్ లో 6.8 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే అందించారు. ఈ ఫోన్ ఆక్టా కోర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌ పై పనిచేయనుంది. ఇకపోతే కెమెరాల విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మిగిలిన రెండు కెమెరాలకు 64 మెగాపిక్సెల్‌ ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 8కె రికార్డింగ్ సపోర్టింగ్ కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ సామర్త్యాన్ని కలిగి ఉండనుంది.