YouTube: మల్టీ లాంగ్వేజ్‌తో యూట్యూబ్‌ కొత్త ఫీచర్… నచ్చిన ఆడియోతో వీడియో చూడొచ్చు!

ప్రపంచమంతా అంతర్జాలమయం అయిపోయింది. ‌కంటెంట్‌ క్రియోటర్లకు యూట్యూబ్ ప్లాట్‌ ఫాంగా మారిపోయింది. ఎంతో మందికి ఇది ఆదాయ వనరుగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు యూట్యూబ్‌ అప్‌డేట్‌లు ఇస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Youtube Multi Language Audio Track 1024x576

Youtube Multi Language Audio Track 1024x576

YouTube: ప్రపంచమంతా అంతర్జాలమయం అయిపోయింది. ‌కంటెంట్‌ క్రియోటర్లకు యూట్యూబ్ ప్లాట్‌ ఫాంగా మారిపోయింది. ఎంతో మందికి ఇది ఆదాయ వనరుగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు యూట్యూబ్‌ అప్‌డేట్‌లు ఇస్తుంది. కొత్తకొత్త ఫీచర్లు తెస్తోంది. తాజాగా మరో ఫీచర్‌తో ఈ యూట్యూబ్‌ మన ముందుకు వచ్చేసింది. అదేంటో చూద్దాం.

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో నచ్చితే దాన్ని మన సర్కిల్‌లోని వ్యక్తులకు షేర్ చేస్తాం. కొన్నిసార్లు అందులోని ఆడియో ఇతర భాషలో
ఉంటే అవతలి వ్యక్తికి అస్సలు అర్ధం అయ్యే పరిస్థితి లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా యూట్యూ బ్ ఓ కొత్త ఫీచర్‌ను పరిచయం
చేయనుంది. మల్టీ-లాంగ్వేజ్ పేరుతో ఈ ఫీచర్‌ను యూట్యూబ్‌ తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు వేర్వేరు భాషలలో ఆడియోను యాడ్ చేయొచ్చు.

దీనివల్ల యూజర్లు ఇతర భాషల్లో తమకు నచ్చిన వీడియోలోని సమాచారాన్ని సులువుగా అర్థం చేసుకోగలరని యూట్యూబ్ భావిస్తోంది.
దీనివల్ల యూజర్లకు ఎంతో ప్రయోజం కూడా ఉందనుందని తెలుస్తోంది. అంతేకాకుండా మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి. ఎక్కువ శాతం మందికి ఆయా రాష్ట్రాల్లోని స్థానిక లాంగ్వేజీ మాత్రమే అర్ధం అవుతోంది. అందుకే ఈ మల్టీ-లాంగ్వేజ్ తీసుకురానున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫీచర్ ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూట్యూబ్ తెలిపింది. ఈ ఫీచర్
అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు, సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో యూజర్ తనకు నచ్చిన భాషను ఎంపిక చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. వీడియోకు ప్రాథమికంగా ఏ ఆడియో ఉండాలనేది కంటెంట్ క్రియేటర్ల నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.

మొబైల్, డెస్క్‌టాప్, ట్యాబ్, టీవీ యూట్యూబ్‌ వెర్షన్లలో ఈ ఫీచర్ రానుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని, త్వరలోనే సాధారణ యూజర్లకు సైతం పరిచయం చేయనున్నట్లు కంపెనీ చెబుతోంది. సుమారు 40 భాషల్లో ఉండనుంది.

  Last Updated: 24 Feb 2023, 10:10 PM IST