YouTube Auto Dubbing : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఇక పండుగే. ప్రత్యేకించి లోకల్ భాషల్లో వీడియో కంటెంట్‌ను తయారు చేస్తున్న వారికి ఉపయోగపడే సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ తీసుకొచ్చింది. అదే.. ‘ఆటో డబ్బింగ్’. ఈ సరికొత్త ఫీచర్ సాయంతో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత లైవ్లీగా తయారు చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Trump Sons Fiancee : కాబోయే కోడలికి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి.. కొడుకుతో ఆమె నిశ్చితార్ధంపై సస్పెన్స్ ?
‘ఆటో డబ్బింగ్’ ఫీచర్ సాయంతో కంటెంట్ క్రియేటర్లు ఇతర భాషల్లోనూ తమ కంటెంట్‌ను ఈజీగా తయారు చేయొచ్చు. ఈ ఫీచర్‌ను వాడుకొని వీడియోలలోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషలోకి మార్చేయొచ్చు. భాషా పరమైన ఇబ్బందులు లేకుండా తమ వీడియోలను ఇతర భాషల్లోకి తర్జుమా చేయొచ్చు. ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషలలోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసే అవకాశాన్ని ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్ అందిస్తుంది. ఒకవేళ వీడియోలోని వాయిస్ ఇక్కడ మనం చెప్పుకున్న ఏదైనా ఒక భాషలో ఉన్నా.. ఆటోమెటిక్‌గా ఇంగ్లిష్‌లోకి డబ్బింగ్ అయిపోతుంది.
Also Read :Bharat Antariksha Station : 2035కల్లా భారత అంతరిక్ష కేంద్రం రెడీ.. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడు
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ ద్వారా డబ్ చేసిన ఆడియోలపై ‘ఆటో డబ్‌డ్’ అనే లేబుల్ యూజర్లకు కనిపిస్తుంది. ఒకవేళ కంటెంట్ క్రియేటర్లు డబ్బింగ్ వాయిస్‌ను వద్దు అని భావిస్తే.. ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ద్వారా ఒరిజినల్ వాయిస్‌ను(YouTube Auto Dubbing) వినొచ్చు. కంటెంట్ క్రియేటర్లు వీడియోను అప్‌లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్‌గా వాయిస్‌ని గుర్తించి సపోర్ట్ చేసే భాషల్లోకి డబ్ చేసేస్తుంది. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్‌లో డబ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోలను కంటెంట్ క్రియేటర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే వీడియోలోని వాయిస్‌ను గుర్తించని సందర్భాల్లో డబ్బింగ్ ఆప్షన్ పనిచేయదు.