YouTube Update: యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ యాప్స్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మనకు ఏ సమాచారం కావలన్నా వీడియో రూపంలో లభ్యమవ్వడం దీని స్పెషాలిటీ. ఇప్పుడు యూట్యూబ్‌లో ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. చానెల్స్‌లోని వీడియోలను మూడు సపరేట్ ట్యాబ్స్‌లో యూట్యూబ్ డివైడ్ చేయనుంది. దీంతో ఏదైనా యూట్యూబ్ చానెల్ పేజ్‌లో లాంగ్ వీడియోలు, షార్ట్స్, లైవ్ వీడియోలను సులువుగా గుర్తించవచ్చు. ఈ కొత్త పీచర్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫీచర్ ఉపయోగాలు.. సాధారణంగా యూట్యూబ్ ఓపెన్ చేయగానె లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్ వీడియోలు ఒకే ఫీడ్‌లో ఆర్డర్లో కనిపించేవి. చానెల్‌లో వెతికేందుకు మనం కష్టపడాల్సి వచ్చేది. అయితే యూట్యూబ్ కొత్తగా ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇక నుండి చానెల్ పేజీలో లాంగ్ వీడియోలు, షార్ట్స్‌కు వేరు వేరు ట్యాబ్స్ ఉంటాయి. అలాగే లైవ్ వీడియోలకు కూడా మరో ట్యాబ్ అందుబాటులో ఉంటుంది.
ఇప్పుడు ఈ నయా ఫీచర్‌తో చానెల్‌లో లాంగ్ వీడియోలు, షార్ట్స్‌ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది వరకు వీడియో సెక్షన్ మొత్తం ఒకే దగ్గర కలిసి ఉండేవి. ఇప్పడు వీటికి సపరేట్ ట్యాబ్స్ వచ్చాయి. దీనివలన మీ ఫేవరెట్ వీడియోలను మీరు సులభంగా వెతుక్కోవచ్చు.
షార్ట్స్ చూడాలనుకునే వారు.. వెళ్లి షార్ట్స్ ట్యాబ్‌లోకి, లాంగ్ వీడియోలు కావాలనునేవారు లాంగ్ వీడియో ట్యాబ్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన వీడియోను ప్లే చేసుకోవచ్చు. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ , ఐఓఎఎస్ యూట్యూబ్ యాప్స్‌తో పాటు వెబ్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానెల్ పేజీ వివరాల లుక్‌ను కూడా మార్చే ప్రణాళికలు జరుగుతున్నాయి.