Site icon HashtagU Telugu

YouTube: యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఫీచర్ వ‌చ్చేసింది..

Youtube Ai Music Tool

Youtube Ai Music Tool

YouTube AI Music Tool: యూట్యూబ్ త‌న ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ క్రియేట‌ర్ల కోసం కొత్త ఆర్టిపిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఈ కొత్త ఫీచ‌ర్ ద్వారా మ‌న‌లోని సంగీత ద‌ర్శ‌కుడిని వెలికితీస్తుంది. మ‌న వీడియోల‌కు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ను మ‌న‌మే డిజైన్ చేసుకోవ‌చ్చు. అదికూడా వాయిద్యాలు లేకుండా, స్టూడియో లేకుండా.. కేవ‌లం ఏఐ ఆధారిత టూల్ తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ను క్రియేట్ చేసుకోవ‌చ్చు.

Also Read: LSG vs GT: గుజ‌రాత్‌కు షాకిచ్చిన ల‌క్నో.. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో పంత్ సేన‌దే విజ‌యం!

ప్ర‌స్తుతం యూట్యూబ్‌ క్రియేట‌ర్లు వారి వీడియోల‌కు స‌రిపోయే మ్యూజిక్ కోసం అనేక వెబ్ సైట్ల‌లో వెత‌కాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కాపీ రైట్‌, లైసెన్స్‌, బ‌డ్జెట్ అవ‌న్నీ ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. అయితే, అలాంటి ఇబ్బంది లేకుండా యూట్యూబ్ కొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. అది క్రియేట‌ర్ మ్యూజిక్ ట్యాబ్ లో భాగంగా యూట్యూబ్ స్టూడియోలో ల‌భిస్తుంది.

 

ప్ర‌స్తుతం ఇది కొంత‌మందికి మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రికీ ఈ ఫీచ‌ర్ రోల్ కానుంది. అయితే, ఈ ఫీచ‌ర్ ఉప‌యోగించాలంటే మీరు క్రియేట‌ర్ మ్యూజిక్ ట్యూబ్ లోకి వెళ్లాలి. అక్కడ ఏఐ మ్యూజిక్ అసిస్టెంట్ అనే కొత్త సెక్ష‌న్ క‌నిపిస్తుంది. అక్క‌డ మీరు ఒక చిన్న డిస్క్రిప్ష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది.

 

యూట్యూబ్ ఏఐ మ్యూజిక్ టూల్ ఏ మోడ‌ల్ మీద ప‌నిచేస్తోందో స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. కానీ, ఇది యూట్యూబ్‌ గూగుల్ జెమినీ ఆధారంగా ఉండే వ‌కాశం ఉంది. మ్యూజిక్ అసిస్టెంట్ భాగంలో జెమిని స్పార్కిల్ ఐకాన్ ఉన్నందున ఇది గూగుల్ జెమినీ మోడ‌ల్ తో వ‌స్తుంద‌ని ప‌క్కాగా చెప్ప‌లేం. యూజ‌ర్ రాసే ప్రాంప్ట్ ల‌ను యూట్యూబ్ 30రోజుల పాటు నిల్వ ఉంచుతుంది. దీని ఉద్దేశం యూజ‌ర్ల ప్రాంప్ట్ ల‌ను విశ్లేషించి, మ‌రింత మెరుగైన ఫ‌లితాలు ఇవ్వ‌డ‌మే.