YouTube Premium Lite: యూట్యూబ్‌లో వీడియోలను చూసే క్రమంలో వరుస యాడ్స్‌ను చూసి చూసి అలసిపోయారా ? అయితే మీకోసం, మీ బడ్జెట్‌కు తగిన రేంజులో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చే పనిలో యూట్యూబ్ నిమగ్నమైంది. త్వరలో మన ముందుకు రాబోతున్న ఆ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పేరే.. ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూద్దాం..
Also Read :Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నుంచి హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
‘యూట్యూబ్ ప్రీమియం’ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ధర ప్రస్తుతం నెలకు రూ.149 ఉంది. భారత్‌లాంటి చాలా అల్ప ఆదాయ దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో ఈ ప్లాన్‌కు అంతగా ఆదరణ రాలేదు. ఆయా దేశాల్లో చాలామంది ప్రజల ఆదాయ స్థాయులు తక్కువగా ఉన్నాయి. దీంతో వారు సబ్ స్క్రిప్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈనేపథ్యంలో యూట్యూబ్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ‘యూట్యూబ్ ప్రీమియం’ సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయలేని వారి కోసం ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’ ప్లాన్‌ను తీసుకురాబోతోంది. దీని నెలవారీ ధర కేవలం రూ.75 వరకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ‘ప్రీమియం ప్లాన్’తో పోలిస్తే ‘ప్రీమియం లైట్ ప్లాన్’(YouTube Premium Lite) ధర సగానికి సగం తక్కువ. ఈ ప్లాన్ వల్ల తమకు మంచి ఆదాయం వస్తుందని, చాలామంది యూజర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారని యూట్యూబ్ అంచనా వేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ను తీసుకొచ్చిన తర్వాతే.. యూజర్ల ఆలోచన ఎలా ఉందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
Also Read :Baba Hamas : కశ్మీరులో ‘ఉగ్ర’ నెట్వర్క్.. తెరపైకి బాబా హమాస్.. అతడు ఎవరు ?
కేవలం యాడ్స్ తగ్గుతాయి.. అంతే!
మరో కొస మెరుపు ఏమిటంటే.. ‘యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్’ను సబ్‌స్క్రయిబ్ చేసుకున్నా యాడ్స్ రావడం అనేది ఆగదు. అయితే యాడ్స్ కొంత తక్కువగా వస్తాయి. అంటే కేవలం యాడ్స్‌ను తగ్గించుకునేందుకు ఈ ప్లాన్‌ను యూట్యూబ్ సేల్ చేస్తోందన్న మాట. ఈ మెలికను యూట్యూబ్ యూజర్లు జీర్ణించుకుంటారా ? కేవలం యాడ్స్ సంఖ్యను తగ్గించుకునేందుకు డబ్బులు పే చేసి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారా ? అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల్లో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను యూట్యూబ్ టెస్ట్ చేస్తోంది. అక్కడ టెస్టింగ్ పూర్తయ్యాక మన దేశంలో దాన్ని పరిచయం చేసే అవకాశం ఉంది.