Site icon HashtagU Telugu

YouTube AI Features : యూట్యూబ్‌లో​​ బోరింగ్ వీడియోలకు చెక్.. ఏఐ ఫీచర్స్ ఇవిగో

Youtube

Youtube

YouTube AI Features : వాట్సాప్ కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పుడే అదే బాటలో యూట్యూబ్ కూడా పయనిస్తోంది. తమ యూజర్ల సౌకర్యార్ధం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కూడిన 3 కొత్త ఫీచర్లను త్వరలోనే ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఆ ఫీచర్లు అందుబాటులోకి  వచ్చాక బోరింగ్​, లెంగ్తీ వీడియోలు కూడా యూజర్లకు వినోదాన్ని పంచేలా తయారవుతాయని అంటున్నారు. అందుబాటులోకి రాబోయే ఏఐ ఫీచర్లను వాడుకొని మనం పెద్దపెద్ద వీడియోలను సులువుగా నావిగేట్ చేయొచ్చు. ఆ వీడియోలపై వచ్చే కామెంట్స్‌ను ఈజీగా​ సమ్మరైజ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ వీడియోస్​లో నేరుగా ప్రశ్నలు అడగడానికి, సమాధానాలు రాబట్టడానికి ఛాన్స్ కూడా ఉంటుందట. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఏఐ వీడియో నావిగేషన్ టూల్

పెద్దపెద్ద వీడియోలను పూర్తిగా చూడాలంటే బోర్ కొడుతుంది. అలాంటి వారి కోసం ఏఐ వీడియో నావిగేషన్ టూల్ వస్తోంది. దీని ద్వారా ఒక వీడియోలోని మంచి ఇంట్రెస్టింగ్​ పాయింట్​ వద్దకు లేదా సెగ్మెంట్​ వద్దకు నేరుగా మనం చేరుకోవచ్చకు. ఇందుకోసం మీరు వీడియోపై రెండు సార్లు నొక్కాలి. వెంటనే మీకొక బటన్​ కనిపిస్తుంది. దానిని ట్యాప్ చేయగానే సదరు వీడియోలోని మంచి ఇంట్రెస్టింగ్​ సెగ్మెంట్​లోకి మనం వెళ్లిపోతాం. ప్రస్తుతం ఈ ఏఐ ఫీచర్‌ను​ అమెరికాలోని ప్రీమియం సబ్​స్క్రైబర్లలో ఎంపిక చేసిన వారికి  అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మిగతా యూజర్లకూ అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : Fake Profiles Mafia : కంబోడియా ‘సైబర్’ గ్యాంగ్ ఉచ్చులో వందలాది మంది తెలుగువారు ?!

ఏఐ కేటగిరైజ్డ్ కామెంట్స్

పెద్ద వీడియోలలో ఒక్కో పార్ట్‌లో ఒక్కో రకమైన టాపిక్ ఉంటుంది. వాటి కింద నెటిజన్స్ నుంచి కామెంట్స్ వస్తుంటాయి. వాటిని టాపిక్ వైజ్​గా వెతకడానికి ‘ఏఐ కేటగిరైజ్డ్ కామెంట్స్’ ఫీచర్‌ రాబోతోంది.  ఈ ఫీచర్ వల్ల యూజర్లకు నచ్చిన కంటెంట్ గురించి క్రియేటర్లు తెలుసుకోవచ్చు. తద్వారా యూజర్లకు నచ్చిన వీడియోలను చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. నెగెటివ్​ కామెంట్స్​ను, వీడియోలోని అనవసరమైన భాగాలను తొలగించే వీలు కూడా కలుగుతుంది.

ఏఐ ఆస్క్ బటన్

ఎడ్యుకేషనల్​ వీడియోల కోసం యూట్యూబ్ Ask అనే సరికొత్త ఏఐ బటన్​ను(YouTube AI Features) తీసుకొచ్చింది. దీనితో వీడియోను ఆపకుండానే, నేరుగా ఎడ్యుకేటర్​తో ఇంటరాక్ట్ కావచ్చు. మీరు ‘ఆస్క్’ బటన్​పై క్లిక్ చేసి ప్రశ్నలు పంపొచ్చు. క్రియేటర్లు సమాధానాలు చెప్పొచ్చు.  అంటే కంటెంట్ క్రియేటర్లు ఈ ఆప్షన్ ద్వారా క్విజ్ కూడా నిర్వహించొచ్చు. తమ వ్యూయర్లకు కంటెంట్ రికమండేషన్స్ చేయొచ్చు. ఈ మూడు ఏఐ ఫీచర్లు ప్రస్తుతం కొందరు ప్రీమియం యూజర్లకే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది.

Also Read :Uber Bill Viral : ఉబెర్‌‌తో ఆటో రైడ్.. బిల్లు రూ.7.66 కోట్లు.. ప్రయాణికుడికి షాక్