You Tube: యూట్యూబ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధనలను సవరించిన యూట్యూబ్ సంస్థ?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది వినియోగిస్తున్న యాప్ యూట్యూబ్. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినా యూట్

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 06:37 PM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది వినియోగిస్తున్న యాప్ యూట్యూబ్. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినా యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ సంస్థ ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో చిన్న చిన్న అప్డేట్లను తీసుకువస్తూనే ఉంది. అందులో భాగంగానే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ లకు తాజాగా ఒక చక్కని శుభవార్తను తెలిపింది. యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను సవరించింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌ స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది.

చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్‌ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను మార్చింది. అంటే, ఇకపై తక్కువ సబ్‌స్క్రైబర్ల బేస్‌ ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చన్నమాట. కాగా యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు అన్న ఉండాల్సిందే. దీంతోపాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్‌ షార్ట్స్‌ వీడియో వ్యూస్‌ అయిన ఉండాలి. కాగా యూట్యూబ్‌ కొత్త మానిటైజేషన్‌ నిబంధనల ప్రకారం..

ఇకపై 500 మంది సబ్‌ స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌కు అప్లయ్‌ చేసుకోవచ్చు. అయితే తొలుత కొత్త మానటైజేషన్‌ నిబంధనల్ని అమెరికా, బ్రిటన్‌, కెనడా, తైవాన్‌, దక్షిణ కొరియాలో యూట్యూబ్‌ సంస్థ తీసుకొస్తోంది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ అమలు చేయనుంది. అయితే భారత్‌కు ఎప్పుడు తీసుకొస్తుంది అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఏదేమైనా యూట్యూబ్‌ కొత్త రూల్స్‌ వల్ల చిన్న క్రియేటర్లు సైతం ఇకపై యూట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదించడానికి వీలు కలుగుతుంది.