Site icon HashtagU Telugu

YouTube: యూట్యూబర్లకు శుభవార్త.. ఆదాయం పెరిగేలా మరో సరికొత్త ఫీచర్!

Youtube

Youtube

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కి ఉన్న క్రేజ్ డిమాండ్ ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆప్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. యూట్యూబ్ ద్వారా చాలామంది తమ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే లక్షలకు లక్షలు కూడా సంపాదిస్తున్నారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటూ భారీగా అర్జిస్తున్నారు. ఇక వినియోగదారుల కోసం యూట్యూబ్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

క్రియేటర్లకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. షాపింగ్‌ అఫ్లియేట్ ప్రోగ్రామ్‌ పేరుతో యూట్యూబ్ కొత్త ఫీచర్‌ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో అర్హులైన క్రియేటర్లు తన వీడియోల్లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేసి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చట. కాగా ఈ ఫీచర్‌ ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో అందేబాటులోకి రాగా ఈ సేవల్ని తాజాగా మరిన్న దేశాలకు విసర్తించేందుకు ప్రణాళికలు రచిస్తోంది యూట్యూబ్. ఇందులో భాగంగా యూట్యూట్ తాజాగా ఈ సేవలను భారత్ లో కూడా లాంచ్‌ చేసింది. ఇందుకోసం గాను మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుందట. అర్హులైన కంటెట్‌ క్రియేటర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.

ఈ ఫీచర్‌ను పొందాలంటే క్రియేటర్లు ముందుగా యూట్యూబ్‌ షాపింగ్‌ లో సైనప్‌ అవ్వాల్సి ఉంటుందట. మీ దరఖాస్తును యూట్యూబ్‌ అమోదం తెలిపిన తర్వాత ఈ సదుపాయాన్ని యాక్సెస్‌ చేసుకోవచ్చట. దీంతో యూట్యూబ్‌ లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు, షార్ట్‌ లు, లైవ్‌స్ట్రీమ్‌ లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేయవచ్చని చెబుతున్నారు. యూజర్లకు ఆ ఉత్పత్తులు నచ్చితే పక్కనే ఉన్న షాపింగ్‌ సింబల్‌ పై క్లిక్‌ చేస్తే ఆ ప్రొడక్ట్‌ వివరాలు కనిపిస్తాయి. దీనికోసం వేరే బ్రౌజర్‌ పేజ్‌కు కూడా వెళ్లాల్సిన పనిలేదు. అక్కడే ఉత్పత్తి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చట. అంతేకాదు నచ్చిన ప్రొడక్ట్‌ ని అక్కడే పిన్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇలా యూట్యూబర్స్‌ ప్రమోట్‌ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్‌ లభిస్తుంది. ఒక వీడియోలో సుమారు 30 ప్రొడక్ట్స్‌ ను ట్యాగ్ చేసుకోవచ్చు. ట్యాగ్ చేసే ముందే మీకు వచ్చే కమిషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. 10 వేల మంది కంటే ఎక్కువ సబ్‌ స్క్రైబర్లు ఉన్న వారికి ఈ అవకాశం ఉంటుంది. చిన్నారుల కోసం నడుపుతోన్న ఛానల్స్‌, మ్యూజిక్‌ ఛానల్స్‌ కు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. యూట్యూబ్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూట్యూబర్ల ఆదాయం భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.