YouTube Down : 20 నిమిషాలు యూట్యూబ్ డౌన్.. ఏమైంది ?

YouTube Down : టెక్నికల్ ఇష్యూ రావడంతో  ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ దాదాపు 20 నిమిషాల పాటు స్తంభించి పోయింది.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 05:39 PM IST

YouTube Down : టెక్నికల్ ఇష్యూ రావడంతో  ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ దాదాపు 20 నిమిషాల పాటు స్తంభించి పోయింది. దీంతో యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా యూట్యూబ్ యూజర్లు గందరగోళానికి గురయ్యారు. అనూహ్యంగా యూట్యూబ్ యాప్ ఓపెన్ కాకపోవడం, వీడియోలు అప్‌లోడ్ కాకపోవడంతో యూజర్లు, యూట్యూబర్లు పరేషాన్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 20 నిమిషాల పాటు యూట్యూబ్ సేవల్లో అంతరాయం కంటిన్యూ అయినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

డౌన్‌ డిటెక్టర్ ప్రకారం.. యూట్యూబ్ స్ట్రక్ (YouTube Down) అయిన సమస్య గురించి డౌన్‌ డిటెక్టర్ వెబ్‌సైట్‌కు దాదాపు 100 మంది వినియోగదారులు నివేదించారు. 80 శాతం మంది యూట్యూబ్ వినియోగదారులు వీడియోలను చూడటంలో, వాటిని అప్‌లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్య యూట్యూబ్ యొక్క భారతీయ వినియోగదారులు మాత్రమే ఎదుర్కొన్నారా ? ప్రపంచ వినియోగదారులు అందరూ ఎదుర్కొన్నారా ? అనేది స్పష్టంగా తెలియలేదు. YouTube సర్వర్ డౌన్ లేదా ఏవైనా ఇతర సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు వెబ్ సైట్ల సర్వర్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సేవల్లోనూ అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని గంటల పాటు వాటి సేవలు నిలిచిపోయాయి. తాజాగా ఈ సమస్య యూట్యూబ్‌లోనూ రిపీట్ అయింది.