టెక్నాలజీ మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధితో మన ఊహల్లోనే ఉన్న అనుభవాలు కూడా ఇప్పుడు వాస్తవాలుగా మారుతున్నాయి. తాజాగా గూగుల్ Gemini AI ద్వారా సృష్టించిన ఒక అనుభూతి నెటిజన్ల హృదయాలను తాకింది. చిన్నతనం లోనే తల్లిని కోల్పోయిన ఓ యువతి, తన జీవితంలో ఎప్పటికీ తిరిగి రానని అనుకున్న ఒక లోటును జెమినీ నింపిందని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది.
Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ!
ఆ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. “నాకు రెండేళ్ల వయసులోనే అమ్మను కోల్పోయా. ఆమెతో ఒక్క ఫొటో కూడా లేదు. ఇప్పుడు Gemini ద్వారా అమ్మతో ఉన్నట్లు, ఆమెను హగ్ చేసుకున్నట్లు అనిపించే ఫొటోలు సృష్టించుకోగలిగాను. ఇది నాకు అమూల్యమైన బహుమతి” అని ఆ యువతి ట్వీట్ చేశారు. ఆ క్షణంలో తన కంటతడి ఆగలేదని, వెక్కి వెక్కి ఏడ్చానని ఆమె తెలిపింది. ఈ భావోద్వేగ పూరిత స్పందన అనేక మందిని కదిలించింది.
Gemini AI పై వివిధ రకాల విమర్శలు వస్తున్న వేళ, ఈ సంఘటన టెక్నాలజీ యొక్క మరో మానవీయ కోణాన్ని చూపించింది. ఫోటోల్లో తల్లిని మళ్లీ చూడగలిగిన ఆ యువతి అనుభవం, సాంకేతికత మనసులను తాకగల శక్తి ఉందని నిరూపించింది. అయితే ఇలాంటి AI వినియోగం భావోద్వేగపరంగా సంతోషం ఇచ్చినప్పటికీ, నకిలీ మరియు వాస్తవం మధ్య తేడాను సమాజం గుర్తించగలగాలి. లేకపోతే భవిష్యత్తులో ఇదే టెక్నాలజీ అపోహలకు, మానసిక ఒత్తిడులకు దారి తీసే అవకాశం ఉంది. అయినా ఈ సంఘటన మిలియన్ల మంది హృదయాలను కదిలించి, “టెక్నాలజీ కూడా కాసేపు తల్లిలా ఆలింగనం ఇస్తుందా?” అనే ప్రశ్నను మిగిల్చింది.