Site icon HashtagU Telugu

Whats App New Feature : వాట్సాప్ గ్రూప్ నుంచి సైలెంటుగా తప్పుకునేలా ఫీచర్!!

Whatsapp Imresizer

Whatsapp Imresizer

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. వాట్సాప్ గ్రూప్ లలో ఉన్నవారు .. ఒకవేళ దాని నుంచి ఎగ్జిట్ అయినా గ్రూప్ చాట్ లో అది అందరికీ కనిపించదు. కేవలం గ్రూప్ అడ్మిన్ లకే కనిపిస్తుంది. ఈమేరకు వాట్సాప్ లో మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం డెస్క్ టాప్ వాట్సాప్ వెబ్ వర్షన్ లో దీనికి సంబంధించిన టెస్టింగ్ జరుగుతోందంటూ ఓ టెక్ బ్లాగ్ లో కథనం ప్రచురితమైంది. ఈ ఫీచర్ ను బీటా, ఆండ్రాయిడ్ రెండు వర్షన్లలోనూ విడుదల చేసేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్ గ్రూప్ లో ఉండే సభ్యుల సంఖ్యను కూడా ఇటీవల 256 నుంచి 512కు పెంచారు. దీన్ని కూడా విడతల వారీగా అన్ని వర్షన్ల ఫోన్లలో అందుబాటులోకి తేనున్నారు. వాట్సాప్ మెసేజ్ లను లాంగ్ ప్రెస్ చేసి.. అక్కడికక్కడే రిప్లై ఇచ్చేందుకు 6 రకాల ఇమోజీలను కూడా ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చింది.