ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ వినియోగదారులతో పాటు ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇంస్టాగ్రామ్ వినియోగిస్తున్న వారి సంఖ్యలో ఉంది. వీరితోపాటు రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో వినియోగదారుల సంఖ్యలో మరింత పెంచుకోవడం కోసం ఇంస్టాగ్రామ్ సంస్థ ఆకర్షణీయమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అలాగే ఇప్పటికే వాట్సాప్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన ఫీచర్స్ లో కీలక మార్పులను కూడా తీసుకువస్తోంది. అయితే మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను కొద్దిమందితో మాత్రమే.
అంటే మీకు నచ్చిన వ్యక్తులతో పంచుకునే అవకాశం కూడా ఉందట. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది స్నేహితులు ఉంటే, మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు లేదా స్టేటస్‌లను ఎంపిక చేసిన అనుచరులకు మాత్రమే ఎలా పంచుకుంటారు? అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం ముందుగా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓస్ ఫోన్ లలో ఇంస్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ దిగువన ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై ప్రొఫైల్ పేజీలో కుడి ఎగువ మూలలో ఉన్న మూడు హారిజాంటల్ లైన్స్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఎంపికల జాబితా నుండి క్లోజ్ ఫ్రెండ్స్ పై క్లిక్ చేయాలి. తరువాత క్లోజ్ ఫ్రెండ్స్ పేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో మీకు కావలసిన స్నేహితులను మాత్రమే ఎంచుకోవాలి. మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్ లో చాట్ చేసినప్పుడు వారు ఆన్‌లైన్ లో ఉన్నప్పుడు కూడా ఇది మీకు తెలియజేస్తుందట.
కాని దీనికి ఒక ట్విస్ట్ ఉందట. మీరిద్దరూ ఒకరినొకరు అనుసరిస్తారా ?లేదా అనేది స్థితిని చూడటానికి ఆధారపడి ఉండదట. కానీ ఇద్దరు కూడా ఒకరి2తో ఒకరు సందేశాల మార్పిడి చేసుకుంటున్నప్పుడు మాత్రమే చివరి సీన్ కనిపిస్తుందట. అయితే ముందుగా, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓస్ పరికరంలో ఇంస్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేసి, తర్వాత కుడి ఎగువ మూలలో ఉన్న పేపర్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్ లోని DM విభాగం క్కడ మీరు చివరిగా చాట్ చేసిన వ్యక్తులను చూడవచ్చు. మీ లాస్ట్ సీన్ యాక్టివిటీని ఇతరులు చూడకుండా నిరోధించడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. దీని కోసం మీరు మీ ప్రొఫైల్ ట్యాబ్ కి వెళ్లి కాగ్‌వీల్ ఐకాన్ పై నొక్కి, ఆప్షన్స్ స్క్రీన్‌కి వెళ్లాలి. ఈ ట్యాబ్‌లో, సెట్టింగ్‌లకు క్రిందికి స్క్రోల్ చేసి షో ఆక్టివిటీ స్టేటస్ ఎంపికను ఆఫ్ చేయండి. తద్వారా మీ చివరి సీన్‌ను ఎవరూ చూడరు.