Site icon HashtagU Telugu

WhatsApp Update : వాట్సాప్ లో మీ చాట్ ఇంకొకరు చూడకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్ ఆన్ చేయాల్సిందే..

You Have To Turn On This Setting To Prevent Others From Seeing Your Chat On Whatsapp.

You Have To Turn On This Setting To Prevent Others From Seeing Your Chat On Whatsapp.

WhatsApp New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు వాట్సాప్ ని అనేక విషయాల కోసం ఉపయోగిస్తూనే ఉంటారు. అలా రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ (WhatsApp) సంస్థ కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ (WhatsApp) సంస్థ తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

We’re now on WhatsApp. Click to Join.

మామూలుగా మనం ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ లేదా బయట ఎక్కడైనా ఉన్నప్పుడు వాట్సాప్ లో చాట్ చేస్తున్నప్పుడు పక్క వారు గమనించడం చూడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే పర్సనల్ చాట్ చూడకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలా మీరు కూడా మీ పర్సనల్ చాట్ ని పక్కవాళ్లకు కనిపించకూడదు అని అనుకుంటున్నారా. అయితే మీ మొబైల్ ఫోన్లో ఒక సెట్టింగ్ ఆన్ చేయాల్సిందే. ఇంతకీ ఆ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ డెస్క్‌టాప్‌లో ఓపెన్ చాట్‌ను దాచాలనుకుంటే, దానిని ఎవరూ చూడకూడదనుకుంటే, మీరు మొదట క్రోమ్ వెబ్ స్టోర్‌కి వెళ్లాలి. ఆ తర్వాత మీరు వాట్సాప్ కోసం WA వెబ్ ప్లస్‌కు వెళ్లాలి. తర్వాత ఆడ్ టు క్రోమ్ పై క్లిక్. తర్వాత, బ్రౌజర్‌ను మూసివేసి, మళ్లీ ఓపెన్ చేయాలి.

గూగుల్ క్రోమ్ లో వాట్సాప్ వెబ్ లాగిన్. ఇప్పుడు మీరు హైడ్, బ్లర్ చాట్‌ల ఆప్షన్ ను పొందుతారు. చాట్‌లను బ్లర్ చేయడంతో పాటు, మీరు ఈ పొడిగింపుతో అనేక టూల్స్ ని పొందుతారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ పొడిగింపుతో విసుగు చెందితే, మీరు దీన్ని ఎప్పుడైనా సులభంగా తీసివేయవచ్చు. దీని కోసం మీరు గూగుల్ క్రోమ్ లోని ఈ పొడిగింపుపై క్లిక్ చేసి, ఆపై టూల్‌బార్ ను క్రోమ్ నుండి తీసివేయి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Also Read:  Lava Storm 5G: మార్కెట్ లోకి మరో సరికొత్త లావా స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?