ఐఫోన్ కి మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లోకి ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అయిన ఐఫోన్లకు ఉన్న ప్రత్యేకత వేరు అని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో ఐఫోన్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చాలామంది వీటి ధరల కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం యాపిల్ సంస్థ ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లను అందిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే వినియోగదారులకు ఒక చక్కటి శుభవార్తను తెలుపుతూ 89 వేల ఐఫోన్ ని కేవలం 16 వేలకే అందిస్తోంది అమెజాన్ సంస్థ.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ 2023లో విడుదలైన విషయం తెలిసిందే. బ్లాక్ కలర్ లో విడుదలైన ఈ ఫోన్ 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంను కలిగి ఉంటుంది. ఈ హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ను చాలా చీప్ గా దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. అయితే వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 89,600 కాగా, దీనిపై అమెజాన్ 9 శాతం ధరను తగ్గించింది. అంటే రూ. 81,900కి అందిస్తోంది. అయితే అంతకు మించే మీరు డబ్బును ఆదా చేసుకునే అవకాశాన్ని అమెజాన్ అందిస్తోంది. ఏకంగా రూ. 58,700లను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తోంది. అదెలా అంటే మీ పాత ఐఫోన్ ను ఎక్స్‌చేంజ్ చేస్తే ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే మీ పాత ఐఫోన్ ని బట్టి ధర తగ్గింపు ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
అంతేకాక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మరో రూ. 6,470 తగ్గింపు లభిస్తుంది. మొత్తం మీద ఈ ఆఫర్లను కలుపుకుని యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ని మీరు రూ. 16,730కే కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో ప్రోమోషన్ టెక్నాలజీ, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వీటి సాయంతో మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది. ప్రాసెసర్ దీనిలో సరికొత్త ఏ16 బయోనిక్ చిప్ ఉంటుంది. దీని సాయంతో అధిక పనితీరు, ఎఫిషీయన్సీని అందిస్తుంది. మల్టీ టాస్కింగ్ కు ఇది బాగా ఉపకరిస్తుందని చెప్పాలి. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్లో వెనుక వైపు 48ఎంపీ ప్రధాన సెన్సార్ ఉంటుంది. ఇది తక్కువ కాంతి ఉన్న సమయంలో కూడా మంచి ఫోటో, వీడియో క్వాలిటీని అందిస్తోంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ లోని అత్యధిక సామర్థ్యం కలిగిపోయిన బ్యాటరీ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుంది. డిస్ ప్లే లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.