ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. నగరాల నుంచీ గ్రామీణ ప్రాంతాల వరకు ఫోన్ పే, గూగుల్ పే (Phonepe & Google Pay) వంటి యాప్‌ల ద్వారా ప్రజలు సులభంగా నగదు బదిలీ చేస్తున్నారు. అయితే జూలై 16న దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యూపీఐ, ఏటీఎమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
J&K Tragedy : కాశ్మీర్ లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఐదుగురు మృతి
ఎస్‌బీఐ ప్రకటన ప్రకారం.. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో జూలై 16న అర్ధరాత్రి 1:05 గంటల నుంచి 2:10 గంటల వరకు సుమారు 65 నిమిషాల పాటు యూపీఐ, ఐఎంఫ్‌పీఎస్, యోనో, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఏటీఎమ్ సేవలు నిలిపివేయబడతాయి. ఈ సమయంలో ఎలాంటి డిజిటల్ లావాదేవీలు చేయలేరని బ్యాంక్ స్పష్టం చేసింది. కస్టమర్లు ముందస్తుగా తన లావాదేవీలను పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులను ప్రభావితం చేయనుంది.
డిజిటల్ లావాదేవీల ఆధారంగా జీవించే ప్రజల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో, యూపీఐ వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోతే ఇబ్బందులు తప్పవు. దీంతో ఎస్‌బీఐ తమ కస్టమర్లకు ముందుగానే హెచ్చరించి, ఆ సమయంలో అత్యవసర నగదు అవసరాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. బ్యాంకింగ్ సేవలకు తాత్కాలిక అంతరాయం కలుగుతుందే తప్ప, శాశ్వత ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ లావాదేవీలను షెడ్యూల్ ప్రకారం ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.