Yamaha MT-15 V2: యమహా ఎంటి 15 వి2 బైక్.. ఫీచర్లు మామూలుగా లేవుగా?

జపనీస్ బ్రాండ్ అయిన యమహా ఇప్పటికే మార్కెట్ లోకి అనేక రకాల బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 06:35 PM IST

జపనీస్ బ్రాండ్ అయిన యమహా ఇప్పటికే మార్కెట్ లోకి అనేక రకాల బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం యమహా ఎంటీ 15 వి2 మోడల్ ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మోడల్ బైక్ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేసినప్పటి నుంచి కంపెనీ పోర్ట్ పోలియోలో ఎక్కువగా డిమాండ్ ఉన్న మోటార్ సైకిళ్లలో యమహా కూడా ఒకటిగా మారింది. ఇకపోతే పాత వెర్షన్ అయినా యమహా ఎంటీ వి2 ను చేసి రిలీజ్ చేసిన సరికొత్త బైక్ యొక్క రివ్యూ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా ఈ బైక్ యొక్క ఫీచర్ ల విషయానికి వస్తే..ఈ బైక్‌లో ఉండే స్లిప్పర్ క్లచ్ రైడర్‌కు కంఫర్ట్ ను ఇస్తుంది. అలాగే గేర్ లని కూడా సున్నితంగా మార్చే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇంజిన్ ని కట్ ఆఫ్ ఫీచర్‌ తో కూడిన సైడ్ స్టాండ్, స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్‌తో కూడిన కొత్త ఆల్ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఈ బైక్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ బైక్ గేర్ పొజిషన్, ఇంధన వినియోగం, షిఫ్ట్ టైమింగ్ లైట్ వంటి వాటిని కూడా డిస్‌ ప్లే చేస్తుంది. కాగా ఈ బైక్‌ వై కనెక్ట్ యాప్‌ తో సింక్ అవుతుంది.

అలాగే బ్లూటూత్ సహాయంతో స్మార్ట్‌ ఫోన్‌ ను ఈజీగా పెయిర్ చేసుకొని ఇన్‌కమింగ్ కాల్స్, మిస్డ్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇ మెయిల్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ లెవల్ వంటి సమాచారాన్ని కూడా ఈ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో అందిస్తుంది. అంతే కాకుండా ఈ వై కనెక్ట్ యాప్ ద్వారా రోజువారీ, నెలవారీ ఇంధన వినియోగం, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ వంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.