Xiaomi: షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 06:20 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో షియోమీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ రెడ్‌మీ కె60 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ని డిసెంబర్‌ లో లాంచ్ చేయనుంది షియోమీ. ఇది ఇప్పటివరకు ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో రెడ్‌మీ కే60, రెడ్‌మీ కే60 ప్రో, రెడ్‌మీ కే60ఈ లాంచ్ కానున్నాయి. Qualcomm ఫాస్టెస్ట్ ప్రాసెసర్ రెడ్‌మీ K60లో అందించవచ్చు. రెడ్‌మీ K60Eలో డైమెన్సిటీ 8200 లేదా డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ సపోర్ట్ ఇవ్వవచ్చు.

రెడ్‌మీ K60 ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ విషయానికి వస్తే స్టాండర్డ్ మోడల్ రెడ్‌మి కె60 కోడ్‌నేమ్ సోక్రటీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. లేటెస్ట్ ప్రాసెసర్ సాధారణంగా హై-ఎండ్ వేరియంట్‌లతో సపోర్ట్ చేయబడుతుంది. రెడ్‌మీ కే 60ఈ కోడ్‌నేమ్ Rembrandt అండ్ కంపెనీ దీనిని ఎక్స్‌ట్రీమ్ అని పిలుస్తుంది. అనగా ఈ సిరీస్‌ లో ఈ ఫోన్ అత్యంత హై ఎండ్ ఫోన్ అవుతుంది. ఇకపోతే రెడ్‌మీ కే60 సిరీస్ స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే..ఈ సిరీస్ తాజాగా 3సి అండ్ IMEI డేటాబేస్‌లో కూడా కనిపించిందట. రెడ్‌మీ కే 60 స్మార్ట్ ఫోన్‌ 6.67 అంగుళాల డిస్ ప్లే తో లభించనుంది. అలాగే 2కే రిజల్యూషన్‌తో రానుంది. 12జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ సపోర్ట్ లభించనుంది.

రెడ్‌మీ కే 60 సిరీస్‌తో 5,500mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంది. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వవచ్చు. రెడ్‌మీ కే 60 సిరీస్ కెమెరా అండ్ బ్యాటరీ విషయానికి వస్తే.. రెడ్‌మీ కే 60 సిరీస్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్,8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ లో ఈ ఫోన్ లభించనుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీ అండ్ వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరాను ఉపయోగించుకోవచ్చు.