Site icon HashtagU Telugu

New Smartphone: 5 నిమిషాల్లో ఆరు లక్షల ఫోన్లు అమ్మకాలు.. ఆల్ టైం రికార్డ్ సృష్టించిన రెడ్ మీ?

Mixcollage 04 Dec 2023 08 31 Pm 7770

Mixcollage 04 Dec 2023 08 31 Pm 7770

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త ఫోన్లు విడుదల అవుతాయా అని వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ విడుదల అవ్వడం ఆలస్యం వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ల కోసం ఎగబడుతూ ఉంటారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయంలో వార్తలు నిలిచిన షావోమీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. షావోమీ రెడ్ మీ కె 70 సిరీస్ ఇటీవల లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రెడ్ మీ కె70ఈ, కె70, కె 70 ప్రో లు ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల సేల్ రికార్డులు సృష్టిస్తున్నాయి.

రెడ్ మీ కె 70 సిరీస్ 5 నిమిషాల్లో 6,00,000 యూనిట్ల విక్రయాన్ని పూర్తి చేయడమే కాకుండా 2022లో లాంచ్ అయిన రెడ్ మీ కె 60 సిరీస్ విక్రయానికి రెట్టింపు సేల్స్ ను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ అయింది. 12జీబీ + 256జీబీ ధర 1,999 యువాన్ లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.23,509 గా ఉంది. అలాగే 12జీబీ + 512జీబీ స్టోరేజ్ ధర 2,199 యువాన్ లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.25,843 గా ఉంది. రెడ్‌మి కె70, కె70 ప్రో మోడల్ 1440×3200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయి. రెడ్‌మి కె70 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. అయితే, రెడ్‌మి కె70 స్పాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంది. ఈ కె-సిరీస్ ఫోన్లలో షావోమీ కొత్త హైపర్ఓఎస్ రన్ అవుతుంది.

16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో వస్తాయి. రెడ్‌మి కె70 ప్రో 24జీబీ వరకు ర్యామ్ 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. రెడ్‌మి కె70 16జీబీ వరకు ర్యామ్ 1టీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. రెడ్‌మి కె70 ప్రో మోడల్ 50ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మరోవైపు, రెడ్‌‌మి కె70లో 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి.

రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. రెడ్‌మి కె70 ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్ఐ 2,499 అనగా దాదాపు రూ. 29వేలు నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ధర 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ సీఎన్‌వై 2,699 దాదాపు రూ. 31వేలు, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 2,999 అనగా దాదాపు రూ. 35వేలు గా ఉంది. 16జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,399 అనగా దాదాపు రూ. 40వేలు గా ఉంటుంది.