Site icon HashtagU Telugu

Xiaomi 13T: త్వరలోనే మార్కెట్ లోకి షావోమి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Xiaomi 13t

Xiaomi 13t

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ ​దిగ్గజం షావోమి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్ లు కలిగిన సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే షావోమి సంస్థ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. షావోమీ ఈ నెల 26వ తేదీన షావోమీ 13 సిరీస్‌లో భాగంగా షావోమీ 13టీ, షావోమీ 13టీ ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో సెప్టెంబర్ 26న లాంచ్‌ అవుతోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే..

ఇందులో 6.67ఇంచెస్‌తో కూడిన 144 హెజ్‌జెడ్‌ రిఫ్రేష్‌ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక షావోమీ 13టీ ప్రోలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ తో కూడిన పవర్‌ ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే… ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వైఫై 802.11, జీపీఎస్‌, బ్లూటూత్‌ వీ5.30, యూఎస్‌బీ టైప్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 62,000గా ఉండొచ్చని అంచాన వేస్తున్నారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..