Xiaomi Book Air 13: సరికొత్త ల్యాప్టాప్ లను విడుదల చేసిన షావోమి.. ధర ఫీచర్లు ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ షావోమి స్మార్ట్ గ్యాడ్జెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తనదైన

Published By: HashtagU Telugu Desk
Xiaomi Book Air 13

Xiaomi Book Air 13

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ షావోమి స్మార్ట్ గ్యాడ్జెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్రను వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన షావోమి ఇప్పుడు ల్యాప్టాప్ లను కూడా తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షావోమి సంస్థ బుక్‌ ఎయిర్‌ 13 పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ ను లాంచ్‌ చేసింది. అయితే తాజాగా ఈ ల్యాప్ ట్యాప్ ను చైనాలో విడుదల చేసింది షావోమి సంస్థ.

ఈ ల్యాప్ ట్యాప్ 12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ సీపీయూతో పని చేయనుంది. అలాగే ఇందులో 16GB వరకు LPDDR5 RAM, 512జీబీ ఎస్ఎస్ డి స్టోరేజ్‌ని అందించారు. ఈ ల్యాప్ ట్యాప్ స్క్రీన్ 13.3 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో లభిస్తోంది. డాల్బీ విజన్‌, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్‌ను ప్రత్యేకంగా అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 65 వాట్స్‌ ఫాష్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 58.3 డబ్ల్యూహెచ్‌ఆర్‌ బ్యాటరీని అందించారు. కానీ ఈ ల్యాప్‌టాప్‌ ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేయనున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

తాజాగా విడుదల చేసిన ఈ ల్యాప్ ట్యాప్ ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ల్యాప్‌ట్యాప్‌ విండోస్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో పని చేస్తుంది. వైఫై 6ఈ , బ్లూటూత్ 5.2, రెండు థండర్‌ బోల్ట్ 4 పోర్ట్‌లు, ఒక ఆడియో జాక్ లాంటి కనెక్టివిటీ ని అందించారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ ను ఐ5, ఐ7 పేర్ల తో వేరియంట్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఐ7 ధర విషయానికొస్తే.. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 79,753 గా ఉంది. ఐవీ వేరియంట్‌ ధర రూ. 68,336గా ఉంది.

  Last Updated: 29 Oct 2022, 06:06 PM IST