Redmi Buds 5: మార్కెట్ లోకి విడుదలైన రెడ్‌మీ కొత్త ఇయర్‌ బడ్స్‌.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దగ్గర తయారీ సంస్థ షావోమీ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. రెడ్‌మీ బడ్స్‌

Published By: HashtagU Telugu Desk
Mixcollage 16 Feb 2024 04 45 Pm 6509

Mixcollage 16 Feb 2024 04 45 Pm 6509

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దగ్గర తయారీ సంస్థ షావోమీ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. రెడ్‌మీ బడ్స్‌ 5 పేరుతో ఈ ఇయర్‌ ఫోన్స్‌ను తీసుకొచ్చింది. మంచి ఫీచర్లతో, బడ్జెట్‌ ధరలో వీటిని కంపెనీ తీసుకొచ్చింది. ఫ్యూజియర్‌ వైట్, ఫ్యూజియర్ పర్పుల్‌, ఫ్యూషియన్‌ బ్లాక్‌ కలర్స్‌ లో వీటిని లాంచ్‌ చేశారు. ఈ ఇయర్‌ బడ్స్‌ ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌తో పాటు, షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ నెల అనగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ ఇయర్‌ బడ్స్‌ సేల్‌ ప్రారంభకానుంది. రెడ్‌మీ బడ్స్‌5 ధరని రూ. 2,999గా నిర్ణయించారు.

ఇకపోతే రెడ్‌మీ బడ్స్‌ 5 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 5 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను అందించారు. 20Hz నుండి 20kHz ఫ్రీక్వెన్సీ పరిధిని కలిగి ఉంది. ఇందులో గోల్డెన్ ఇయర్ టీమ్ ద్వారా బాస్ బూస్ట్, వోకల్ ఎన్‌హాన్స్‌మెంట్, EQ సౌండ్ ఎఫెక్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు 46 డెసిబుల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. అంటే ఈ ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు బయటి శబ్ధాలు అస్సలు వినిపించవు. దీంతో యూజర్లు మంచి నాణ్యతో కూడిన సౌండ్‌ను వినవచ్చు.

మరి ముఖ్యంగా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం షావోమీ ప్రత్యేకంగా యాంటీ విండ్‌ నాయిస్‌ అల్గారిథమ్, డ్యూయల్ మైక్రోఫోన్‌లకు ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించారు. కనెక్టివిటీ కోసం, ఈ ఇయర్‌బడ్‌లు డ్యూయల్ డివైస్ స్మార్ట్ కనెక్షన్, బ్లూటూత్ 5.3ని ఇచ్చారు. గూగుల్ ఫాస్ట్ పెయిర్, టచ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను ఇచ్చారు. ఇందులో 54 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఇయర్‌ బడ్స్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 40 గంటల బ్యాకప్‌ అందిస్తుంది. ఇయర్‌ బడ్స్‌ ఛార్జింగ్ కోసం టైప్‌ సి పోర్ట్‌ను అందించారు. వీటిని కేవలం 5 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే 2 గంటలు ఉపయోగించుకోవచ్చు. అలాగే దుమ్ము, ధూళి, చెమట లేదా నీటి స్ప్లాష్‌ల నుంచి రక్షించడానికి, కంపెనీ IP54 డస్ట్, స్ప్లాష్‌ప్రూఫ్ టెక్నాలజీని అందించారు.

  Last Updated: 16 Feb 2024, 04:46 PM IST