చైనీస్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షియోమీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే షియోమీ 1 సిరీస్ ను ప్రపంచ మార్కెట్ తో పాటు భారత మార్కెట్లోకి కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సిరీస్ లో షియోమీ 15 ఆల్ట్రా షియోమీ 15 లు ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్ లు ఒకే మెమరీ వేరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి. షియోమీ 15 సిరీస్ గొప్ప కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ తో ప్రీమియం విభాగంలోకి వచ్చింది.
మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇది మంచి ఎంపిక అని చెప్పాలి. కాగా షియోమీ 15 అల్ట్రా సిల్వర్ క్రోమ్ రంగులో లభిస్తుంది. షియోమీ 15 నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ లను కంపెనీ గత నెలలో చైనాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే WC 2025 లో కూడా ప్రవేశపెట్టబడ్డాయి. కాగా ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0 పై నడుస్తాయి. ఐపీ 68 రేటింగ్ తో వస్తాయి. ఇకపోతే షియోమీ 15 అల్ట్రా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.36 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ బ్రైట్ నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC.
అలాగే 50ఎంపీ లైట్‌హంటర్ 900 ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్. 50MP 3.2x టెలిఫోటో లెన్స్ తో రానుంది. అలాగే 32ఎంపీ ఓమ్నివిజన్ OV32B40 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండనుంది. బ్యాటరీ విషయానికొస్తే.. 5,240mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 90W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ లకు సపోర్ట్ చేస్తాయి. అలాగే ఐపీ 68 దుమ్ము, నీటి నిరోధకత, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, NFC, డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లతో రానున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ల ధరల విషయానికొస్తే.. షియోమీ 15 అల్ట్రా ధర రూ.1,09,999 కాగా, Xiaomi 15 ధర రూ. 64,999 గా ఉంది. ఇది కాకుండా షియోమీ 15 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్ లెజెండ్ ఎడిషన్ ధర రూ.11,999 గా ఉంది. షియోమీ 15 సిరీస్ ప్రీ బుకింగ్ ఈ నెల అనగా మార్చి 19న సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో షియోమీ 15 కొనుగోలుపై రూ.5,999 విలువైన షియోమీ కేర్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. అయితే Xiaomi 15 అల్ట్రా కొనుగోలుపై ఉచిత ఫోటోగ్రఫీ కిట్ లెజెండ్ ఎడిషన్ అందిస్తారట.