Site icon HashtagU Telugu

Xiaomi 15 Ultra: మార్కెట్ లోకి షావోమి నుంచి అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. విడుదల తేదీ ఎప్పుడు తెలుసా?

Xiaomi 15 Ultra

Xiaomi 15 Ultra

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల కాబోతోంది అన్న వివరాల్లోకి వెళితే.. Xiaomi 15 సిరీస్‌ను విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌ లో షావోమి 15, షావోమి 15 అల్ట్రా వంటి రెండు మోడల్‌ లు ఉంటాయి. ఈ ఫోన్ మార్చి 2 న ఇండియాలో లాంచ్ చేయనున్నారు. అయితే దీని కంటే ముందు ఫిబ్రవరి 27న చైనాలో అధికారికంగా లాంచ్ అయ్యింది. దీని తరువాత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా దీనిని ప్రారంభించాలని భావిస్తున్నారు. షావోమి తన అధికారిక చైనీస్ వెబ్‌ సైట్‌ లో ఈ ఫోన్ రెండర్‌ ను విడుదల చేసింది.

షావోమి తన ఇతర ఉత్పత్తులను SU7 అల్ట్రా ఈవీ కారు, షావోమి బడ్స్ 5 ప్రో, రెడీమీ బుక్ ప్రో 2025 లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కాగా ఈ షావోమి 15 అల్ట్రా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుందట. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ తో వస్తుందట. ఇది గ్లాస్, వీగన్ లెదర్ మిశ్రమాన్ని కలిగి ఉంటుందట. అలాగే ఇది లైకా కెమెరాల క్లాసిక్ డిజైన్ నుండి ప్రేరణ పొందిందట. ఫోన్ వెనుక ప్యానెల్‌ లో వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉందని, దీనిలో నాలుగు కెమెరా సెన్సార్లు, LED ఫ్లాష్ ఉన్నాయట. షావోమి దాని మునుపటి అల్ట్రా సిరీస్ డిజైన్ గుర్తింపును తెచ్చుకోనుంది. ఈసారి వెనుక ప్యానెల్ ఎగువ ఎడమ మూలలో ఇటాలిక్ అల్ట్రా బ్రాండింగ్‌ ను కూడా కలిగి ఉందట. ఇకపోతే హార్డ్‌వేర్ గురించి చెప్పాలంటే, షావోమి 15 అల్ట్రా ఇటీవల గీక్ బెంచ్ ఏఐ డేటాబేస్‌ లో కనిపించిన స్నాప్‌ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ తో ఉండనుంది.

ఈ ఫోన్ 16జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ పై రన్ అవుతుందట. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే… 50ఎంపీ 1 అంగుళాల సోనీ LYT 900 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50ఎంపీ Samsung ISOCELL JN5 అల్ట్రా వైడ్ కెమెరా, 50ఎంపీ సోనీ IMX858 టెలిఫోటో లెన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇది 200ఎంపీ సాంసంగ్ ISOCELL HP9 సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 4.3x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌ లతో వస్తుందట. ఇకపోతే ఈ సినిమా ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఇది నలుపు, తెలుపు, వెండి వంటి మూడు రంగులలో లభించనుంది. షావోమి 15 అల్ట్రా ప్రారంభ ధర CNY 6,499 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 77,700 గా ఉంటుంది. కంపెనీ భారతదేశంలో Xiaomi 14 Ultra 16GB+512GB ని రూ. 99,999 ధరకు విడుదల చేసింది..