Site icon HashtagU Telugu

Xiaomi 15 Series: మార్కెట్లోకి రాబోతున్న షావోమీ 15 సిరీస్.. లాంచింగ్ డేట్ ఫిక్స్!

Xiaomi 15 Series,

Xiaomi 15 Series,

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సరికొత్త ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. కాగా షావోమీ 15, షావోమీ 15ప్రో వచ్చే వారం చైనాలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఈ బ్రాండ్ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. హైపర్ఓఎస్2.0తో కూడిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ ఫోన్‌ లు షావోమీ ఎస్‌యూ7 అల్ట్రా, షావోమీ ప్యాడ్ 7 సిరీస్, షావోమీ బ్యాండ్ 9 ప్రోతో పాటు రిలీజ్ అయ్యాయి. చైనీస్ టెక్ బ్రాండ్ ఫోన్‌ల డిజైన్‌ను వెల్లడిస్తూ అధికారిక ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. షావోమీ 15 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌ డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీగా వస్తుంది.

ఇది షావోమీ హైపర్‌కోర్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. కాగా షావోమీ 15 సిరీస్ అక్టోబర్ 29న ప్రకటించనుందని చైనా స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం వెల్లడించింది. ఈ లాంచ్ ఈవెంట్ చైనాలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభం అవుతుందట. ఈ ఈవెంట్‌ లో కంపెనీ షావోమీ ప్యాడ్ 7 సిరీస్, షావోమీ ఎస్‌యూ7 అల్ట్రా, షావోమీ బ్యాండ్ 9 ప్రోలను కూడా లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0 స్కిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. షావోమీ 15, షావోమీ 15 ప్రో ఫస్ట్ లుక్ పోస్టర్లలో మైక్రో కర్వ్డ్ స్క్రీన్, అడ్వాన్స్‌డ్ లైకా ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో డిజైన్‌ ను అందిస్తాయి. బ్యాక్ కెమెరా లేఅవుట్ షావోమీ 14 సిరీస్ మాడ్యూల్ డిజైన్‌ను పోలి ఉంటుంది.

కలర్ ఆప్షన్లు కూడా మునుపటి సిరీస్‌ తో సమానంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న డిజైన్ లాంగ్వేజీని కొనసాగించనుంది. గత వెర్షన్ల మాదిరిగానే షావోమీ 15, షావోమీ 15ప్రో స్లిమ్ బెజెల్స్ సర్కిల్ కార్నర్స్ కలిగి ఉన్నాయి. ఇందులో బేసిక్ మోడల్ ఫ్రేమ్ ఏవియేషన్ అల్యూమినియం తో తయారైంది. షావోమీ 15ప్రో ఫోన్ 8.35ఎమ్ఎమ్ మందం, 213 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. షావోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 2.0తో క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్‌ ను కలిగి ఉంటుంది. వనిల్లా షావోమీ 15 ఫోన్ 6.36 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. షావోమీ ఎస్‌వీపీ ఆడమ్ జెంగ్ ఈ వారం ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్‌ లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీని స్వీకరించిన మొదటి స్మార్ట్‌ఫోన్ షావోమీ 15 సిరీస్‌‌గా కంపెనీ ధృవీకరించింది.

Exit mobile version