Site icon HashtagU Telugu

Twitter: ట్విట్టర్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై ఎక్స్ లో వీడియో,ఆడియో కాల్స్ చేసుకోవచ్చట!

Mixcollage 21 Jan 2024 03 12 Pm 9270

Mixcollage 21 Jan 2024 03 12 Pm 9270

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా యాప్స్ వినియోగం ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ట్విట్టర్ ను అయితే సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూనే ఉంటారు. కాగా రోజు రోజుకి ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ యూజర్లను మరింత ఆకర్షిస్తున్నారు. కాగా ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్‌ గా మార్చిన విషయం తెలిసిందే.

అలాగే ఎన్నో రకాల కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూజర్లకు సరికొత్త ఎక్స్ పీరియన్స్‌ను అందించే దిశగా ఎక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్స్‌లో కేవలం ట్వీట్స్‌ మాత్రమే మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. ఎక్స్‌ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ యాక్సెస్‌ పొందొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఫోన్‌ యూజర్లకు ఎప్పుడు ఫీచర్‌ను తీసుకొస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ విషయమై ఎక్స్‌ ఇంజనీర్‌ ఎన్రిక్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం ఎక్స్‌ లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. యాప్‌ను అప్‌డేట్‌ చేసి ఫీచర్‌ను వినియోగించుకోండి అని రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ను ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతర యూజర్లకు ఈ ఫీచర్‌ను అందిస్తారా? లేదా అన్న దానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇతర మెసేజింగ్ యాప్స్‌ నుంచి నెలకొన్ని పోటీ నేపథ్యంలో ఎక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version